KGF:'కేజీఎఫ్' నిర్మాత కొత్త చిత్రం 'టైసన్'

Surya Prakash   | Asianet News
Published : Jun 14, 2022, 09:18 AM IST
KGF:'కేజీఎఫ్' నిర్మాత కొత్త చిత్రం  'టైసన్'

సారాంశం

ఈ ఏడాది వచ్చిన ‘కెజిఎఫ్‌2’ ప్రపంచ వ్యాప్తంగా సంచలన విజయం సాధించి వెయ్యి కోట్లకు పైగా పోగేయటం ఈ సంస్ద నుంచే వచ్చే చిత్రాలు అంటే ఓ రేంజిలో క్రేజ్ క్రియేట్ అయ్యింది.  


యశ్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో రూపొందిన  ‘కెజిఎఫ్‌’ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో తెలిసిందే . రెండు పార్ట్ లు దేశవ్యాప్తంగా  బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకున్నాయి. దాంతో ఈ చిత్ర నిర్మాణ సంస్ద పై అందరి దృష్టి పడింది. ఈ సంస్ద హోంబలే ఫిల్మ్. ఈ ఏడాది వచ్చిన ‘కెజిఎఫ్‌2’ ప్రపంచ వ్యాప్తంగా సంచలన విజయం సాధించి వెయ్యి కోట్లకు పైగా పోగేయటం ఈ సంస్ద నుంచే వచ్చే చిత్రాలు అంటే ఓ రేంజిలో క్రేజ్ క్రియేట్ అయ్యింది. ప్రస్తుతం ఈ సంస్థ తీస్తున్న సినిమాలలో ఎక్కువగా పాన్ ఇండియా రేంజ్ సినిమాలే ఉండటం గమనార్హం. అందులో మొదటిది ప్రభాస్ తో తీస్తున్న ‘సలార్’. అలాగే ఇప్పుడు ఈ సంస్ద టైసన్ టైటిల్ తో ఓ చిత్రం చేస్తోంది.

 మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమార్ నటించి దర్శకత్వం వహిస్తున్న ‘టైసన్’ కూడా షూటింగ్ పూర్తి చేసుకుంది.  మురళి గోపి ఈ చిత్రం స్క్రిప్టు అందిస్తున్నారు. తెలుగు,కన్నడ, తమిళ, మళయాళ, హిందీ భాషల్లో ఈ చిత్రం రెడీ అవుతోంది. సలార్ కన్నా ముందే ఈ చిత్రం రిలీజ్ అవుతుంది. ఈ సినిమాపై ఓ రేంజిలో అంచనాలు ఉన్నాయి. తెలుగులో కూడా త్వరలో ప్రమోషన్స్ మొదలెట్టనున్నారు.

ఇక ‘కెజిఎఫ్‌2’ కి ముందు పునీత్ చివరి సినిమాగా విడుదలైన ‘యువరత్న’ ను నిర్మించింది కూడా హోంబలే ఫిల్మ్ సంస్థే.  ఇక ఈ ఏడాది ఆగస్ట్ 5న విడుదల కాబోతున్న జగ్గేశ్, శ్వేత శ్రీవాత్సవ్ సినిమా ‘రాఘవేంద్రస్టోర్స్’, రిషిబ్ శెట్టి నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న ‘కాంటారా’ ఇదే ఏడాది పెప్టెంబర్ లో రిలీజ్ కానుంది.ప్రశాంత్ నీల్ రచనతో శ్రీమురళి హీరోగా ‘భగీరా’ షూటింగ్ దశలో ఉంది. ‘లూసియా’ ఫేమ్ పవన్ కుమార్ తో కూడా ఓ సినిమా చేస్తున్నారు. నిజానికి ఇందులో పునీత్ రాజ్ కుమార్ నటించాల్సింది. ఆయన లేరు కాబట్టి మరో హీరోతో  ముందుకు వెళ్తున్నారు. 

రక్షిత్ శెట్టి డైరెక్ట్ చేసిన మొదటి సినిమా ‘ఉలిదవరు కందంతే’ కి సీక్వెల్ గా ‘రిచర్డ్ ఆంటోని’ సినిమాను తెరకెక్కిస్తోంది హోంబలే ఫిలిమ్స్. ఇవి కాకుండా సుధాకొంగర దర్శకత్వంలో మూవీ చేయటానికి కమిట్ అయింది. మరి వరుసగా నాన్ స్టాప్ గా సినిమాలు ప్లాన్ చేస్తూ దక్షిణాదిన ఒకే సారి 8 సినిమాలు నిర్మిస్తున్న ఏకైక సంస్థగా ముందుకు సాగుతున్న హోంబలే ఫిలిమ్స్ ఈ సినిమాలతో ఏ స్థాయి విజయాలను అందుకుంటుందో చూడాలి.
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Sobhan Babu రిజెక్ట్ చేసిన సినిమాతో.. బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన హీరో ఎవరు? ఏంటా సినిమా?
Pawan Kalyan కు అభినవ కృష్ణదేవరాయ బిరుదు, ధర్మం, రాజ్యాంగం వేరు కాదన్న పవర్ స్టార్