టీ, సిగరెట్లు నాతో తెప్పించుకునేవారు.. 'కేజీఎఫ్' హీరో కామెంట్స్!

Published : May 23, 2019, 03:47 PM IST
టీ, సిగరెట్లు నాతో తెప్పించుకునేవారు.. 'కేజీఎఫ్' హీరో కామెంట్స్!

సారాంశం

కన్నడ స్టార్ హీరో యష్ 'కేజీఎఫ్' చిత్రంతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. 

కన్నడ స్టార్ హీరో యష్ 'కేజీఎఫ్' చిత్రంతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. కన్నడ ఇండస్ట్రీలో హీరోగా ఎదగకముందు అతడు ఎన్నో కష్టాలు పడ్డాడట. తనకు సక్సెస్ ఊరికే రాలేదని చెబుతున్నాడు ఈ హీరో.

యష్ హీరో కాకముందు కొన్ని టీవీ సీరియల్స్ లో నటించాడు. అలానే కొన్ని టీవీ షోలకు హోస్ట్ గా కూడా వ్యవహరించాడు. సినిమాలో అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న యష్ తన కెరీర్ ఆరంభంలో ఎదుర్కొన్న ఇబ్బందులు గురించి చెప్పుకొచ్చాడు. 

అప్పట్లో అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసే సమయంలో తనతో అడ్డమైన పనులు చేయించుకోవడం తన మనసుకు బాధ కలిగించేదని చెప్పాడు. స్టార్ డైరెక్టర్ల కింద పని చేసే సమయంలో తన చేత టీ, సిగరెట్లు తెప్పించుకునేవారని వివరించాడు. అయితే అలాంటిది వాటికి జంకకుండా తన గోల్ ని విడిచిపెట్టకుండా ప్రయత్నించానని చెప్పుకొచ్చాడు. 

సినిమా బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో అవకాశాలు దక్కించుకొని స్టార్ హోదా అందుకోవడమంటే మామూలు విషయం కాదు.. కానీ యష్ ఎంతో కష్టపడి ఆ స్థాయికి చేరుకున్నాడని ఆయన మాటల్లో అర్ధమవుతోంది. ప్రస్తుతం ఈ హీరో 'కేజీఎఫ్' చాప్టర్ 2 చిత్రంలో నటిస్తున్నాడు. 
 

PREV
click me!

Recommended Stories

Christmas Movies: క్రిస్మస్‌ కానుకగా విడుదలయ్యే సినిమాలివే.. కుర్రాళ్లతో శివాజీ ఫైట్‌.. ఒకే రోజు ఏడు సినిమాలు
అమ్మాయిల దుస్తులపై శివాజీ వల్గర్ కామెంట్స్...చిన్మయి, అనసూయ స్ట్రాంగ్ కౌంటర్