కరోనా దెబ్బతో ప్లాన్ చేసుకున్న ‘కేజీఎఫ్ 2’ రిలీజ్ డేట్ తేడా కొట్టేసింది. ఫస్ట్ కాపీతో సినిమా రిలీజ్ కు రెడీ ఉన్నా..ఏం చేయాలో తెలియని సిట్యువేషన్ లో కు వెళ్లిపోయింది. మొత్తానికి సెకండ్ వేవ్ ఉధృతి తగ్గటంతో రిలీజ్ డేట్ ఫైనలైజ్ చేసినట్లు సమాచారం. ఆ తేదీ ఏంటంటే..
కన్నడ హీరో యష్ ప్రధాన పాత్రలో దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన చిత్రం ‘కేజిఎఫ్’. ఈ సినిమా రెండేళ్ల క్రితం విడుదలై సంచలన విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం దీనికి కొనసాగింపుగా ‘కేజీఎఫ్ 2’ను తెరకెక్కించారు. ఈ సినిమా షూటింగ్ బెంగుళూరు మైసూర్, రామోజీ ఫిల్మ్ సిటీ, బళ్లారి ప్రాంతాల్లో షూటింగ్ జరిపారు. పలువురు బాలీవుడ్ స్టార్స్ ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్న ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ రిలీజ్ పెద్ద సమస్యగా మారింది. అయితే నిర్మాత, దర్శకుడు,హీరో కలిసి ఓ డేట్ ఫిక్స్ చేసారని తెలుస్తోంది.
సినీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ఈ చిత్రం 9 సెప్టెంబర్ న భారీగా విడుదల కానుంది. ఒకవేళ ఇది కుదరకపోతే డిసెంబర్‌లో క్రిస్మస్ సందర్భంగా విడుదల చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నట్లు సమాచారం. అయితే ఈ విషయమై అధికారిక సమాచారం ఏమీ లేదు.
ఇక ఈ సినిమాకి భారీ పెట్టుబఢి పెట్టి...భారీగా అమ్మారు. కరోనా సెకెండ్ వేవ్ కి ముందే కేజిఎఫ్ 2 సినిమా కోసం ఎన్నడూ లేనిది తెలుగులో కూడా గట్టిగా పోటీ పడ్డాయి పలు సంస్థలు. కానీ ఇప్పుడు సీన్ మారిపోయింది. పైగా కేజిఎప్ 2కి మరో మంచి రిలీజ్ డేట్ దొరికేలా లేదు. చూస్తూంటే సోలో రిలీజ్ డేట్ అసాధ్యం అనిపిస్తోంది.
ఈ సినిమాతో కన్నడ సినిమాల మార్కెట్ ను ఒక్కసారిగా ఆకాశాన్ని అందుకుంది.. కన్నడ ఇండస్ట్రీ టెక్నికల్ గా ఉన్నత స్థాయిలో ఉండదన్న అపవాదు చెరిపేసింది.కేజీఎఫ్ ను అత్యుత్తమ నిర్మాణ విలువలతో కూడిన సినిమా ను భారత సినీ ప్రేమికులకు శాండిల్ వుడ్ నిర్మాతలు అందించారు. ఈ సినిమాతో యశ్ హీరో, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఒక్కసారిగా జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ సినిమాలో రాఖీ బాయ్ పోషించిన పాత్ర ప్రతి ఒక్క సినీ ప్రేక్షకుడిని అలరించింది.