నాగ్ ఇలాంటి షోలు చేయడం కరెక్టేనా..? కేతిరెడ్డి ఫైర్!

By AN TeluguFirst Published Jul 30, 2019, 4:13 PM IST
Highlights

తాజాగా విజయవాడలోని ధర్నా చౌక్ లో కేతిరెడ్డి ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన బిగ్ బాస్ షోపై, అక్కినేని నాగార్జునపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ 3 ప్రసారాలు ఆపాలని, సెన్సార్ చేసిన తరువాత షోని టెలికాస్ట్ చేయాలని దర్శకనిర్మాత కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి కొద్దిరోజులుగా డిమాండ్ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే తెలంగాణా హైకోర్టులో పిటిషన్ సైతం దాఖలు చేశారు. ఆ తరువాత బిగ్ బాస్ కంటెస్టంట్లుగా ఎంపిక చేసి హౌస్ లోకి తీసుకోలేదని ఆరోపించిన యాంకర్ శ్వేతారెడ్డి, నటి గాయత్రి గుప్తాతో కలిసి ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నాకు దిగారు.

కానీ ఇవేవీ బిగ్ బాస్ షోపై ప్రభావం చూపలేకపోయాయి. నిర్వాహకులు భావించినట్లుగా జూలై 23న షోని మొదలుపెట్టారు. అయినప్పటికీ కేతిరెడ్డి తన పోరాటాన్ని ఆపలేదు. తాజాగా విజయవాడలోని ధర్నా చౌక్ లో కేతిరెడ్డి ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన బిగ్ బాస్ షోపై, అక్కినేని నాగార్జునపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

బిగ్ బాస్ షోని బ్యాన్ చేయాలని.. ఈ షో నిర్వహించడం చట్టవిరుద్ధమని ఆయన ఆరోపిస్తున్నారు. 'అన్నమయ్య', 'షిరిడి సాయి' లాంటి సినిమాలలో నటించిన నాగార్జున ఇలాంటి షోలు చేయడం ఎంతవరకు కరెక్ట్..? అని ప్రశ్నించారు. ఢిల్లీలో జంతర్ మంతర్ లో ధర్నా చేశామని.. ఈరోజు ఏపీ రాజధాని అమరావతిలో ధర్నా చేస్తున్నామని చెప్పారు.

బిగ్ బాస్ షో కారణంగా యువత చెడు మార్గంలోకి వెళ్తున్నారని.. బిగ్ బాస్ షోని బ్యాన్ చేసేవరకు దేశవ్యాప్తంగా నిరసనలు చేపడతామని అన్నారు. 

click me!