'లూసిఫర్'పై పోలీసుల ఆగ్రహం.. సీఎంకి కంప్లైంట్!

By Udaya DFirst Published Apr 5, 2019, 5:18 PM IST
Highlights

మోహన్ లాల్ హీరోగా నటించిన 'లూసిఫర్' సినిమా మలయాళంలో విడుదలై హిట్ టాక్ తెచ్చుకుంది. అయితే ఈ సినిమాలోని ఓ సన్నివేశం పోలీసుల ఆగ్రహానికి కారణమైంది.

మోహన్ లాల్ హీరోగా నటించిన 'లూసిఫర్' సినిమా మలయాళంలో విడుదలై హిట్ టాక్ తెచ్చుకుంది. అయితే ఈ సినిమాలోని ఓ సన్నివేశం పోలీసుల ఆగ్రహానికి కారణమైంది. కథలో భాగంగా మోహన్ లాల్ ఓ పోలీస్ ఆఫీసర్ గుండెలపై కాలితో తన్నుతారు.

తాజాగా ఈ స్టిల్ ని విడుదల చేసింది చిత్రబృందం. ఈ పోస్టర్ చూసిన కేరళ పోలీసులు సినిమాపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాపై కేరళ పోలీస్ అసోసియేషన్ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కి ఫిర్యాదు చేసింది.

ఇలాంటి పోస్టర్లు యువతపై చెడు ప్రభావాన్ని చూపుతాయని, పోలీసులంటే లెక్కలేనితనం చేస్తాయని పోలీస్ డిపార్ట్మెంట్ ముఖ్యమంత్రికి వివరించారు. ఇలాంటి పోస్టర్లపై చర్యలు తీసుకోకపోతే సమాజంలో చెడును ప్రోత్సహించినట్లు అవుతుందని తమ ఫిర్యాదులో పేర్కొన్నారు.

మరి దీనిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి. ఈ చిత్రం ద్వారా మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకుడిగా పరిచయమయ్యారు. మంజు వారియర్, వివేక్ ఒబెరాయ్, టొవినో థామస్ ఇతర ముఖ్య పాత్రలు పోషించిన ఈ సినిమాను ఇప్పుడు తెలుగులో కూడా విడుదల చేయడానికి సిద్ధమవుతున్నారు. 

click me!