'వెంకీమామ' టైటిల్ లోగో!

Published : Apr 05, 2019, 04:55 PM IST
'వెంకీమామ' టైటిల్ లోగో!

సారాంశం

విక్టరీ వెంకటేష్, అక్కినేని నాగచైతన్య కలిసి నటిస్తోన్న తాజా చిత్రం 'వెంకీ మామ'. 

విక్టరీ వెంకటేష్, అక్కినేని నాగచైతన్య కలిసి నటిస్తోన్న తాజా చిత్రం 'వెంకీ మామ'. రియల్ లైఫ్ లో మామ, అల్లుల్లైన వీరు వెండితెరపై కూడా అలానే కనిపించనున్నారు. ఉగాది  పండగ సందర్భంగా చిత్రబృందం సినిమా టైటిల్ లోగోని విడుదల చేసింది.

ఈ లోగోలో చాలానే ఇన్ఫర్మేషన్ ఉంది కానీ కథ ఏంటి అనేది మాత్రం తెలియడం లేదు. లోగోలో ఒక వైపు విలేజ్ సెటప్ కనిపిస్తుండగా.. మరో వైపు ఆర్మీ, హెలికాప్టర్ వంటివి  కనిపిస్తున్నాయి. ఈ రెండింటికీ మధ్యలో రాశిచక్రం అందులో సినిమా టైటిల్ ఉండడం ఆసక్తిని క్రియేట్ చేస్తోంది.

ఈ లోగోని బట్టి సినిమాలో వెంకీ లేదా చైతు సైనికుడిగా కనిపించనున్నారని తెలుస్తోంది. కెఎస్ రవీంద్ర(బాబీ) డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాలో పాయల్ రాజ్ పుత్, రాశిఖన్నాలు  హీరోయిన్లుగా కనిపించనున్నారు. సురేష్ ప్రొడక్షన్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ల పై ఈ సినిమా తెరకెక్కుతోంది. 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: రీతూ కాదు, తనూజ వెంటపడేవాడిని.. షాకిచ్చిన డీమాన్‌ పవన్‌.. బిగ్‌ బాస్‌ ఎమోషనల్‌ జర్నీ
ఈ హీరోయిన్ నటించిన 4 సినిమాలు డిజాస్టర్లు.. కానీ పేరేమో మరో సావిత్రి