
చిత్ర పరిశ్రమలో ఊహించని ఎక్కువగా మహిళా నటీమణులనే కష్టాలు ఎదురవుతుంటాయి. లైంగిక వేధింపులు, మోసాలు , అవమానాలు నటీమణులకే ఎక్కువగా ఎదురవుతుంటాయి. కానీ తాజాగా ఓ యువ నటుడు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. అది కూడా ఓ మహిళా దర్శకురాలి వల్ల అనే నమ్మగలరా.
ఈ సంఘటన కేరళలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కేసు నమోదు చేసిన పోలీసులు పేర్లు బయట పెట్టకుండా కేసు వివరాలు తెలిపారు. కేరళకు చెందిన 26ఏళ్ల యువ నటుడు టీవీ సీరియల్స్ లో రాణిస్తున్నాడు. సినిమాల్లో కూడా రాణించాలనేది అతడి లక్ష్యం. దీనితో అవకాశాల కోసం ఎదురుచూస్తున్నాడు.
ఎట్టకేలకు ఓ మహిళా దర్శకురాలు కొత్త చిత్రం కోసం అతడిని సంప్రదించింది. దీనితో అతడి సంతోషానికి అవధులు లేకుండా పోయింది. ఈ ఆఫర్ అందుకోవాలంటే ముందుగా అగ్రిమెంట్ లో సంతకం చేయాలని దర్శకురాలు అతడికి చెప్పింది.
ఎట్టకేలకు వచ్చిన సినిమా ఛాన్స్ కావడంతో సంతోషంలో అగ్రిమెంట్ చదవకుండానే సంతకం చేశాడు. ఇక షూటింగ్ లో పాల్గొనేందుకు సెట్స్ కి వెళ్లిన తర్వాత అసలు విషయం బయట పడింది. అక్కడ ఉన్న మహిళా దర్శకురాలు అతడిని బట్టలు విప్పి నగ్నంగా నటించాలని అడిగింది. ఆ యువ నటుడికి అప్పుడు విషయం అర్థం ఐంది.
తాను నటిస్తోంది ఒక బూతు చిత్రంలో అని రియలైజ్ అయ్యాడు. నగ్నంగా అసభ్యకర సన్నివేశాల్లో నటించనని తేల్చి చెప్పేశాడు. ఇక్కడి నుంచి వెళ్లిపోతానని మహిళా దర్శకురాలికి చెప్పాడు. అగ్రిమెంట్ పై సంతకం చేసినట్లుగా బూతు చిత్రంలో నటించాల్సిందే. లేకుంటే 5 లక్షలు తమకి చెల్లించాలి అని బెదిరించింది.
దీనితో ఆ యువకుడికి ఏం చేయాలో అర్థం కాలేదు. ఓటిటి ఫ్లాట్ ఫామ్ లో రిలీజ్ చేసేందుకు ఈ అడల్ట్ చిత్రాన్ని చిత్రీకరిస్తున్నారు. ఇక చేసేది లేక ఆ యువకుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనితో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మహిళా దర్శకురాలిపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు తెలుస్తోంది.