`ప్రాజెక్ట్‌ కే` పోస్టర్ సెన్సేషన్‌‌.. హీరోలు పుట్టరు, ఉద్భవిస్తారంటూ అంచనాలు పెంచుతున్న నాగ్‌ అశ్విన్‌

Published : Oct 23, 2022, 01:38 PM IST
`ప్రాజెక్ట్‌ కే` పోస్టర్ సెన్సేషన్‌‌.. హీరోలు పుట్టరు, ఉద్భవిస్తారంటూ అంచనాలు పెంచుతున్న నాగ్‌ అశ్విన్‌

సారాంశం

ప్రభాస్‌ బర్త్ డే సందర్భంగా ఆయన నటిస్తున్న `ప్రాజెక్ట్ కే` నుంచి సర్‌ప్రైజ్‌ వచ్చింది. ఓ పవర్‌ఫుల్‌ లుక్‌ని విడుదల చేయగా, అది ఇప్పుడు ట్రెండ్‌ అవుతుంది.

హీరోలు పుట్టరు, వాళ్లు ఆవిర్భవిస్తారని అంటున్నారు నాగ్‌ అశ్విన్‌. `ప్రాజెక్ట్ కే`లో ప్రభాస్‌ ఆవిర్భవించిన హీరోగా ఆయన అభివర్ణిస్తున్నారు. తాజాగా ప్రభాస్‌ పుట్టిన రోజు సందర్భంగా ఈ చిత్రం నుంచి ఓ ప్రీ లుక్‌ పోస్టర్‌ని విడుదల చేశారు. పిడికిలి బిగించిన చేతిని చూపించారు. జస్ట్ మోచేతి వరకే చూపించినా, అది అత్యంత పవర్‌ఫుల్‌గా ఉండటం విశేషం. ఆ చేయికి రోబో కవచం తొడిగి ఉండటం విశేషం. ప్రభాస్‌ ఇందులో రోబోగా కనిపిస్తాడా లేక సూపర్‌ హీరోగా కనిపిస్తాడా అనేది ఆద్యంతం ఆసక్తిని రేకెత్తిస్తుంది. 

ఈ సందర్భంగా `హీరోలు పుట్టరు, వాళ్లు ఉద్భవిస్తారు` అనే పేర్కొనడం ఆకట్టుకుంటుంది. సింపుల్‌గా విడుదల చేసిన పోస్టరే గూస్‌బంమ్స్ తెప్పించేలా ఉండటం విశేషం. సైన్స్ ఫిక్షన్‌ నేపథ్యంలో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్టు దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ తెలిపిన విషయం తెలిసిందే. టైమ్‌ ట్రావెల్‌తో కూడిన సైన్స్ ఫిక్షన్‌ అని తెలుస్తుంది. సినిమాపై భారీ అంచనాలున్నాయి. అంతర్జాతీయ స్టాండర్డ్స్ లో ఈ చిత్రాన్ని నాగ్‌ అశ్విన్‌ రూపొందిస్తున్నారు. అమితాబ్‌ బచ్చన్‌, దీపికా పదుకొనె వంటి భారీ కాస్టింగ్‌తో తెరకెక్కుతున్న చిత్రం కావడంతో అంచనాలు తారాస్థాయికి చేరాయి. ఈ సినిమాని అశ్వినీదత్‌ సుమార్‌ 500కోట్ల బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. 

నేడు ఆదివారం(అక్టోబర్‌ 23) ప్రభాస్‌ పుట్టిన రోజు సందర్బంగా ఆయన అభిమానులకు `ప్రాజెక్ట్ కే` యూనిట్‌ చిన్న సర్‌ప్రైజ్‌నిచ్చింది. ఈ సందర్భంగా డార్లింగ్ కి బర్త్ డే విషెస్‌ తెలిపారు. మరోవైపు ప్రాజెక్ట్ కే సినిమా సెట్‌లోనూ ప్రభాస్‌ బర్త్ డే సందర్భంగా సంబరాలు చేశారు. పటాకులు కాల్చి సెలబ్రేట్‌ చేశారు. ఆ వీడియోని సైతం పంచుకుంది యూనిట్‌. ఇలా సింపుల్‌గా సర్‌ప్రైజ్‌ చేసింది `ప్రాజెక్ట్ కే` యూనిట్‌. ఇక ఈ సినిమాని వచ్చే ఏడాది సమ్మర్‌లో విడుల చేయాలనుకుంటున్నారు. లేదంటే 2024 సంక్రాంతికి విడుదల చేసే అవకాశాలున్నాయని సమాచారం.

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Anchor Vindhya: డర్టీ కామెడీ అలవాటు చేసేశారు.. బ్రహ్మానందం, వెన్నెల కిషోర్ పై టాలీవుడ్ యాంకర్ కామెంట్స్
Eesha Review: ఈషా మూవీ రివ్యూ, రేటింగ్‌.. హేబా పటేల్‌, సిరి హనుమంతు భయపెట్టించారా?