మిస్‌ ఇండియా అంటే నేను కాదు ఒక బ్రాండ్‌..విదేశాల్లో కీర్తి చాయ్‌ బిజినెస్‌

Published : Oct 24, 2020, 11:40 AM IST
మిస్‌ ఇండియా అంటే నేను కాదు ఒక బ్రాండ్‌..విదేశాల్లో కీర్తి చాయ్‌ బిజినెస్‌

సారాంశం

జాతీయ అవార్డ్ విన్నర్‌ కీర్తిసురేష్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం `మిస్‌ ఇండియా`, నారేంద్రనాథ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా ట్రైలర్‌ శనివారం దసరా పండుగని పురస్కరించుకుని విడుదలైంది.    

జాతీయ అవార్డ్ విన్నర్‌ కీర్తిసురేష్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం `మిస్‌ ఇండియా`, నారేంద్రనాథ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా ట్రైలర్‌ శనివారం దసరా పండుగని పురస్కరించుకుని విడుదలైంది. 

ఇందులో ఓ వ్యక్తి చిన్నప్పటి కీర్తిని ఉద్దేశించి..`పెద్దయ్యాక నువ్వు ఏమవుతావ్‌` అంటే అందుకు `ఎంబీఏ చేసి బిజినెస్‌ స్టార్ట్ చేస్తా` అని కీర్తి సమాధానం చెబుతుంది. ఆ తర్వాత `నువ్వు నిజానికి చాలా దూరంగా.. అబద్దానికి చాలా దగ్గరగా బతుకుతున్నావు` ఓ వాళ్ళమ్మ అంటుంది. `బిజినెస్‌ అనేది మాటల్లోనుంచే కాదు.. మనసులోంచి కూడా పూర్తిగా తీసేశావు` అని కమల్‌ అంటాడు. కీర్తిని చేతుల్లోకి తీసుకుని రాజేంద్రప్రసాద్‌ `జీవితంలో ఎంత కష్టపడ్డామనేది ముఖ్యం కాదు.. ఎంత సంతోషంగా ఉన్నామనేది ముఖ్యం ` అని చెప్పడం.. 

`ఇండియన్‌ చాయ్‌` బిజినెస్‌ స్టార్ట్ చేస్తా అని కీర్తి అనడం.. ఆ తర్వాత నరేష్‌ ఉండి `మన ఛాయ్‌ని నేల కాని నేలమీద అమ్మడమంటే రియల్లీ గ్రేట్` అనడం, ఆ తర్వాత విలన్‌ అయిన జగపతిబాబు `బిజినెస్‌ అంటూ ఆడపిల్లలు ఆడుకునే ఆట కాదు.. బిజినెస్‌ ఒక యుద్ధం` అని చెప్పగా, `ఈ ప్రాసెస్‌లో మీదాక వస్తానో.. లేదా మిమ్మల్నీ దాటేస్తానో..` అని కీర్తి స్ట్రాంగ్‌ చెబుతుంది. చివరకు మిస్‌ ఇండియా అంటే నేను కాదు.. ఇదొక బ్రాండ్‌` అని తనదైన స్టయిల్‌లో చెప్పడం ఆకట్టుకుంది.

 సినిమా ప్రధానంగా ఓ మహిళ డ్రీమ్‌, వాటిని నెరవేర్చుకోవడం, ఈ క్రమంలో ఎదురైన సవాళ్లని ఎదుర్కోవడం, అంతిమంగా ఉమెన్‌ ఎంపావర్‌మెంట్‌ని చాటడం నేపథ్యంలో సాగుతుందని అర్థమవుతుంది. కీర్తిసురేష్‌ ఇందులో స్లిమ్‌గా  కనిపిస్తూ మరోసారి తన నట విశ్వరూపం చూపించబోతుందని తెలుస్తుంది. ఈ సినిమాని ఈస్ట్ కోస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై మహేష్‌ కోనేరు నిర్మిస్తున్నారు. త్వరలోనే థియేటర్‌లోకి తీసుకురాబోతున్నారు. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

డ్రింక్ తాగు, పార్టీ చేసుకో.. ప్రొటెక్షన్ మాత్రం మర్చిపోకు.! క్రేజీ హీరోయిన్‌కి తల్లి బోల్డ్ సలహా
2025 Missed Heroines: ఈ ఏడాది సిల్వర్ స్క్రీన్‌పై కనిపించని 8 మంది హీరోయిన్లు, 2026లో వీరిదే హవా