దెయ్యంగా కాజల్‌.. వామ్మో ఇలా ఉందేంటి?

Published : Oct 24, 2020, 11:14 AM IST
దెయ్యంగా కాజల్‌.. వామ్మో ఇలా ఉందేంటి?

సారాంశం

కాజల్‌ తాజాగా వెబ్‌ సిరీస్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. అంతేకాదు తాను కూడా ప్రజెంటర్‌గా వ్యవహరిస్తుంది. `లైవ్‌ టెలీకాస్ట్` పేరుతో రూపొందే వెబ్‌ సిరీస్‌లో నటిస్తుంది. హర్రర్‌ ప్రధానంగా సాగే ఈ సిరీస్‌ పోస్టర్‌ని కాజల్‌ తన ఇన్ స్టాగ్రామ్‌ ద్వారా అభిమానులతో పంచుకుంది.

టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ కాజల్‌ త్వరలో పెళ్ళి చేసుకోబోతుంది. ముంబయికి చెందిన బిజినెస్‌మేన్‌ గౌతమ్‌ కిచ్లుని ఈ నెల 30న ముంబయిలో ప్రైవేట్‌ ఈవెంట్‌గా మ్యారేజ్‌ చేసుకునేందుకు రెడీ అవుతుంది. ఓ వైపు పెళ్ళి పనుల్లో బిజీగా ఉన్న కాజల్‌.. ఉన్నట్టుండి కొత్త లుక్‌లోకి మారిపోయింది. దెయ్యంగా దర్శనమిచ్చింది. 

కాజల్‌ తాజాగా వెబ్‌ సిరీస్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. అంతేకాదు తాను కూడా ప్రజెంటర్‌గా వ్యవహరిస్తుంది. `లైవ్‌ టెలీకాస్ట్` పేరుతో రూపొందే వెబ్‌ సిరీస్‌లో నటిస్తుంది. హర్రర్‌ ప్రధానంగా సాగే ఈ సిరీస్‌ పోస్టర్‌ని కాజల్‌ తన ఇన్ స్టాగ్రామ్‌ ద్వారా అభిమానులతో పంచుకుంది. ఈ పోస్టర్‌తో షాక్‌ ఇచ్చిందీ చందమామ. పోస్టర్‌లో దెయ్యంగా కనిపించి భయానికి గురి చేసింది. ఇప్పటి వరకు గ్లామర్‌ పాత్రలతో, అందాల ఆరబోతకే ప్రయారిటీ ఇచ్చిన కాజల్‌లోని ఈ యాంగిల్‌ని చూసి అభిమానులు, నెటిజన్లు షాక్‌కి గురవుతున్నారు. 

దీనికి వెంకట్‌ ప్రభు దర్శకత్వం వహిస్తుండగా, త్వరలోనే ఇది డిస్నీ ప్లస్‌ హాట్‌ స్టార్‌లో ప్రసారం కానుంది. ఇది తమిళ వెబ్‌ సిరీస్‌ కావడం గమనార్హం. ఇక ఈ మిత్రవింద తెలుగులో `ఆచార్య`, తమిళంలో `ఇండియన్‌ 2` చిత్రాల్లో నటిస్తుంది. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Bigg Boss 9 Remuneration పేదలకు పంచి పెట్టిన ఫైర్ బ్రాండ్ కంటెస్టెంట్, నెటిజన్లు ఏమంటున్నారంటే?
700 కోట్లకు పైగా ఆస్తి, 10 ఏళ్ల చిన్నవాడిని పెళ్లాడిన హీరోయిన్, బెడ్ రూమ్ సీక్రేట్ వెల్లడించిన బ్యూటీ ఎవరు?