రానాకి షాక్ ఇచ్చిన కీర్తి సురేష్..!

Published : Sep 17, 2019, 01:16 PM IST
రానాకి షాక్ ఇచ్చిన కీర్తి సురేష్..!

సారాంశం

తన నటనతో ఆడియన్స్ ని మెస్మరైజ్ చేసిన కీర్తి సురేష్ కి తెలుగు, తమిళ భాషల్లో అవకాశాలు పెరిగాయి. ఎక్కువగా లేడీ ఓరియెంటెడ్ కథల్లో నటించే ఛాన్స్ లు వచ్చాయి. 

'మహానటి' సినిమాతో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకొని క్రేజ్ పెంచుకున్న నటి కీర్తి సురేష్. ఈ సినిమాకి నేషనల్ అవార్డు సైతం అందుకుంది. తన నటనతో ఆడియన్స్ ని మెస్మరైజ్ చేసిన ఈ బ్యూటీకి తెలుగు, తమిళ భాషల్లో అవకాశాలు పెరిగాయి. ఎక్కువగా లేడీ ఓరియెంటెడ్ కథల్లో నటించే ఛాన్స్ లు వచ్చాయి.

ప్రస్తుతం ఈ బ్యూటీ 'మిస్ ఇండియా' అనే విమెన్ సెంట్రిక్ సినిమాలో నటిస్తోంది. ఇటీవల ఈ సినిమాకి సంబంధించి చిన్న టీజర్ వదిలారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇది ఇలా ఉండగా.. నటుడు రానా దగ్గుబాటి ఓ కొరియన్ సినిమా రీమేక్ రైట్స్ ని దక్కించుకున్నాడు. 

ఈ రీమేక్ లో కీర్తి సురేష్ ని ప్రధాన పాత్రలో తీసుకోవాలని భావించాడు. డ్రగ్ మాఫియా బ్యాక్ డ్రాప్ లో సాగే ఈ సినిమాలో కీర్తి సురేష్ పోలీస్ ఆఫీసర్ గా నటించాల్సివుంది. ఈ ప్రాజెక్ట్ ఆమె వద్దకు తీసుకువెళ్లగా.. దానికి కీర్తి నో చెప్పింది. తనకు ఆసక్తి లేదని నేరుగా చెప్పలేక కాల్షీట్స్ లేవని చెప్పి తప్పించుకుందట.

కీర్తితోనే సినిమా చేయాలనుకున్న రానాకి షాక్ ఇచ్చింది. ప్రస్తుతం కీర్తికి బదులు మరో నటి కోసం వెతుకులాట మొదలుపెట్టారు. నందిని రెడ్డి ఈ సినిమాను డైరెక్ట్ చేయనుంది. వచ్చే ఏడాదిలో ఈ సినిమా షూటింగ్ మొదలుకానుంది.  

PREV
click me!

Recommended Stories

Top 5 Movies: 2026లో అత్యధిక వసూళ్లు రాబట్టిన టాప్ 5 మూవీస్.. `బూత్‌ బంగ్లా` రచ్చ, నెంబర్‌ 1 ఇదే
Star Kids: తల్లిదండ్రులు సినిమాల్లో కోట్లు సంపాదిస్తుంటే.. వేరే జాబ్స్ చేస్తున్న స్టార్ కిడ్స్