పెళ్లయ్యాక 4 కోట్ల సంపాదన.. కీర్తి సురేష్ కి బ్యాడ్ లక్ తప్పలేదు

By tirumala AN  |  First Published Dec 27, 2024, 3:45 PM IST

కీర్తి సురేష్ కి డిసెంబర్ నెల బిజీ బిజీగా సాగిపోయింది. డిసెంబర్ 12న కీర్తి సురేష్ వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. అదే విధంగా ఆమె బాలీవుడ్ డెబ్యూ చిత్రం బేబీ జాన్ కూడా రీసెంట్ గా విడుదలయింది.


కీర్తి సురేష్ కి డిసెంబర్ నెల బిజీ బిజీగా సాగిపోయింది. డిసెంబర్ 12న కీర్తి సురేష్ వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. అదే విధంగా ఆమె బాలీవుడ్ డెబ్యూ చిత్రం బేబీ జాన్ కూడా రీసెంట్ గా విడుదలయింది. చిన్ననాటి స్నేహితుడు ఆంటోని తట్టిల్ ని పెళ్లి చేసుకుని కీర్తి సురేష్ వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. 15 ఏళ్లుగా ఉన్న స్నేహాన్ని వీరిద్దరూ ప్రేమగా మార్చుకున్నారు. కుటుంబ సభ్యుల అంగీకారంతో ఇద్దరూ మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. గోవాలో పెళ్లి వేడుక గ్రాండ్ గా జరిగింది. 

పెళ్ళైన కొన్ని రోజులకే కీర్తి సురేష్ తన వృత్తితో బిజీగా మారిపోయింది. తమిళంలో ఘన విజయం సాధించిన దళపతి విజయ్ తేరి చిత్రాన్ని హిందీలో బేబీ జాన్ పేరుతో రీమేక్ చేశారు. ఈ చిత్రంతోనే కీర్తి సురేష్ బాలీవుడ్ లోకి డెబ్యూ చేసింది. ఎన్నడూ లేనంతగా బేబీ జాన్ లో గ్లామర్ షో చేసింది. వరుణ్ ధావన్, కీర్తి సురేష్ ఈ చిత్రంలో జంటగా నటించారు. 

Latest Videos

undefined

తేరి చిత్రాన్ని తెరకెక్కించిన డైరెక్టర్ అట్లీ.. బేబీ జాన్ చిత్రాన్ని నిర్మించారు. పెళ్లి తర్వాత కీర్తి సురేష్ నుంచి రిలీజ్ అయిన తొలి చిత్రం ఇదే. ఈ చిత్రానికి కీర్తి సురేష్ 4 కోట్ల భారీ రెమ్యునరేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. రీమేక్ చిత్రం అయినప్పటికీ బాగా ప్రమోషన్స్ చేసి సొమ్ము చేసుకోవచ్చు అని అట్లీ భావించారు. ఒక రేంజ్ లో ప్రమోషన్స్ చేశారు. 

కానీ ఈ చిత్రానికి ఆశించిన ఫలితం రావడం లేదు. క్రిస్టమస్ కానుకగా రిలీజ్ అయిన బేబీ జాన్ చిత్రానికి మిక్స్డ్ రెస్పాన్స్ వస్తోంది. పుష్ప 2 జోరు కొనసాగుతుండడంతో వసూళ్లు కూడా దారుణంగా ఉన్నాయి. దీనితో నిర్మాతగా అట్లీకి నిరాశ తప్పేలా లేదు. ఇక కీర్తి సురేష్ కి కూడా బ్యాడ్ లక్ అనే చెప్పాలి. పెళ్లయ్యాక తొలి చిత్రమే డిజాస్టర్ కావాలని ఎవరు కోరుకుంటారు. 

పెళ్లయ్యాక కీర్తి సురేష్ కి రెమ్యునరేషన్ మాత్రం 4 కోట్లు వచ్చింది. అది ఆమెకి భారీ పారితోషికమే. కానీ సినిమా రిజల్ట్ తేడా కొట్టింది. కీర్తి సురేష్ తదుపరి కొన్ని తమిళ చిత్రాలకు సైన్ చేసింది. తెలుగులో ఎలాంటి ఆఫర్స్ లేవు. కానీ ఆమె నటించిన మహానటి చిత్రం మాత్రం జీవితాంతం గుర్తుండిపోతుంది. మహానటి చిత్రంతో జాతీయ ఉత్తమ నటిగా కీర్తి సురేష్ అవార్డు గెలుచుకున్న సంగతి తెలిసిందే. కీర్తి సురేష్ పెళ్లి తర్వాత సినిమాలు కొనసాగిస్తుందా లేదా అనేది ఇప్పుడే తెలియదు. కీర్తి సురేష్.. మేనకా సురేష్, సురేష్ కుమార్ దంపతుల సంతానం. మేనకా సురేష్ అప్పట్లో నటిగా రాణించారు. మెగాస్టార్ చిరంజీవి తొలి చిత్రం పున్నమినాగులో హీరోయిన్ గా నటించింది మేనకనే. 

తెలుగులో కీర్తి సురేష్ కి మిక్స్డ్ రిజల్ట్స్ ఉన్నాయి. కీర్తి సురేష్ తెలుగులో నేను శైలజ చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది. రామ్ పోతినేని సరసన నటించిన ఆ చిత్రం సూపర్ హిట్ గా నిలిచింది. ఆ తర్వాత నానికి జోడిగా నటించిన నేను లోకల్ చిత్రం కూడా హిట్ అయింది. 

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో అజ్ఞాతవాసి చిత్రంలో నటించింది.  భారీ అంచనాల నడుమ విడుదలైన అజ్ఞాతవాసి ఎంత పెద్ద డిజాస్టర్ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆ తర్వాత మహానటి చిత్రంతో చరిత్రలో నిలిచిపోయే విజయం అందుకుంది. సూపర్ స్టార్ మహేష్ సరసన నటించిన సర్కారు వారి పాట చిత్రం కూడా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. 

Also Read : ఆ సూపర్ హిట్ పాటని చిరుతో నేను చేయాల్సింది, మరో హీరోయిన్ కి మార్చేశారు.. వెక్కి వెక్కి ఏడ్చేశా

దసరా చిత్రంలో మరోసారి నానికి పక్కన నటించిన కీర్తి సురేష్ మరో హిట్ అందుకుంది. భోళా శంకర్ చిత్రంలో చిరంజీవికి చెల్లిగా నటించింది. చాలా మంది సౌత్ హీరోయిన్లు బాలీవుడ్ లో రాణించాలని కలలు కన్నారు. కీర్తి సురేష్ కూడా బాలీవుడ్ లో స్టార్ గా ఎదగాలని తొలి అడుగు వేసింది. కానీ తొలి ప్రయత్నమే నిరాశపరిచింది. కీర్తి సురేష్ కి ఇప్పుడు ఫ్యామిలీ బాధ్యత కూడా ఉంటుంది. కాబట్టి ఇకపై సినిమాలు కోనసాగిస్తుందో లేదో చూడాలి. 

click me!