నటించనని చెబుతున్నా.. వినిపించుకోరేం: కీర్తి సురేష్

Published : Jul 10, 2018, 07:03 PM IST
నటించనని చెబుతున్నా.. వినిపించుకోరేం: కీర్తి సురేష్

సారాంశం

 ఇప్పటివరకు ఫిలిం మేకర్స్ కూడా తనను అటువంటి సీన్లలో నటించమని అడగలేదని చెప్పిన కీర్తిని ఇప్పుడు మాత్రం దర్శకనిర్మాతలు తనను ముద్దు సీన్లలో నటించమని  అడుగుతున్నారట. 'మహానటి' సినిమా తరువాత ఆమెకు వరుస ఆఫర్లు వచ్చి పడుతున్నాయి. 

సినిమా ఇండస్ట్రీ గ్లామర్ షో అనేది కామన్. కొందరు హీరోయిన్లు తమ నటనతో పాటు గ్లామర్ రసాన్ని కూడా ఒలకబోస్తూ అవకాశాలు దక్కించుకుంటున్నారు. మరికొందరు మాత్రం పద్దతిగా కనిపించడానికే ఇష్టపడుతున్నారు. అవకాశాల కోసం తమ హద్దులను దాటమని బహిరంగంగా చెబుతున్నారు. ఈ లిస్టు లో కీర్తి సురేష్ కూడా ఉంది. గ్లామర్ రోల్స్ లో నటించనని, ముద్దు సీన్లకు దూరంగా ఉంటానని ఓపెన్ స్టేట్మెంట్స్ చేసింది.

ఇప్పటివరకు ఫిలిం మేకర్స్ కూడా తనను అటువంటి సీన్లలో నటించమని అడగలేదని చెప్పిన కీర్తిని ఇప్పుడు మాత్రం దర్శకనిర్మాతలు తనను ముద్దు సీన్లలో నటించమని అడుగుతున్నారట. 'మహానటి' సినిమా తరువాత ఆమెకు వరుస ఆఫర్లు వచ్చి పడుతున్నాయి. అందులో కొన్ని కథలు బాగున్నప్పటికీ ముద్దు సీన్లు ఉండడంతో వాటిని యాక్సెప్ట్ చేయలేకపోతుందట. కానీ దర్శకనిర్మాతలు మాత్రం ఆ సీన్లను తొలగించలేమని అంటున్నారట.

దీంతో కథ నచ్చినా.. ఆమె వదులుకోవాల్సిన పరిస్థితి కలుగుతోంది. మొత్తానికి తన వద్దకు వచ్చే అవకాశాలను కూడా వదులుకుంటుందేమో గానీ తెరపై ముద్దు సీన్లు మాత్రం చేయనని క్లియర్ గా చెప్పేస్తుంది ఈ బ్యూటీ. మరి ఈ క్రమంలో ఆమె ఎంతకాలం ఇండస్ట్రీలో కొనసాగుతుందో చూడాలి. ప్రస్తుతం కీర్తి తమిళంలో నాలుగు ప్రాజెక్టులతో బిజీగా గడుపుతోంది!

PREV
click me!

Recommended Stories

Top 10 Heroines : రష్మిక కు సమంత గండం, సినిమాలు లేకున్నా మొదటి స్థానంలో ఎలా? టాప్ 10 హీరోయిన్ల లిస్ట్ ఇదే?
Malliswari Review: బావ మరదలుగా ఎన్టీఆర్, భానుమతి రొమాన్స్, ఫస్ట్ తెలుగు పాన్ వరల్డ్ మూవీగా మల్లీశ్వరి రికార్డు..