Keerthi Suresh: రిలీజ్ కు రెడీ అయిన కీర్తి సురేష్ గుడ్ లక్ సఖీ. ట్రైల‌ర్ ట్రీట్ ఇచ్చిన టీమ్.

Published : Jan 24, 2022, 12:23 PM IST
Keerthi Suresh: రిలీజ్ కు రెడీ అయిన కీర్తి సురేష్ గుడ్ లక్ సఖీ.  ట్రైల‌ర్  ట్రీట్ ఇచ్చిన టీమ్.

సారాంశం

చాలా కాలం క్రితం స్టార్ట్ అయ్యింది కీర్తి సురేష్(Keerthi Suresh)    గుడ్ లక్ సఖీ(Good Luck Sakhi) మూవీ. కరోనా వల్ల అన్ని సినమాలతో పాటు ఈసినిమాకు కూడా గ్యాప్ వచ్చింది. ఇక లేట్ చేయకుండా రిలీజ్ బరిలో నిలిపారు మూవీని.

చాలా కాలం క్రితం స్టార్ట్ అయ్యింది కీర్తి సురేష్(Keerthi Suresh)    గుడ్ లక్ సఖీ(Good Luck Sakhi) మూవీ. కరోనా వల్ల అన్ని సినమాలతో పాటు ఈసినిమాకు కూడా గ్యాప్ వచ్చింది. ఇక లేట్ చేయకుండా రిలీజ్ బరిలో నిలిపారు మూవీని.

 మహానటితో జాతీయ ఉత్తమ నటిగా అవార్డు అందుకున్న కీర్తి సురేష్(Keerthi Suresh)   ప్రధాన పాత్రలో  తెరకెక్కిన సినిమా గుడ్ లక్ సఖి.స్పోర్ట్స్ రొమ్‌-కామ్ గా రూపొందిన ఈ ఉమెన్ సెంట్రిక్ మూవీలో కీర్తి సురేష్ షూటర్‌గా కనిపించనున్నారు. ఆది పినిశెట్టి, జగపతి బాబు ప్రధాన పాత్రలు పోషించారు. స్టార్ ప్రొడ్యూసర్   దిల్‌రాజు(Dil Raju)  సమర్పణలో 'వర్త్ ఏ షాట్ మోషన్ ఆర్ట్స్' బ్యానర్ పై సుధీర్ చంద్ర ప‌దిరి ఈ సినిమాను నిర్మించారు.

 ఎక్కువ మంది మ‌హిళా టెక్నీషియన్స్ తో రూపొందిన సినిమాగా టాలీవుడ్ లో రికార్డ్స్ క్రియేట్ చేయబోతుంది గుడ్ లక్ సఖీ సినిమా. ఈ మూవీని  తెలుగు, తమిళ మరియు మలయాళ భాషలలో ఏకకాలంలో రూపొందిస్తున్నారు. జ‌న‌వ‌రి 28న  ఈ  సినిమాను ప్ర‌పంచ‌వ్యాప్తంగా రిలీజ్ చేయబోతున్నారు.  

28న గుడ్ లక్ సఖి రిలీజ్ సందర్భంగా ముందుగా థియేట్రిక‌ల్ ట్రైల‌ర్‌ని విడుద‌ల చేసింది మూవీ టీమ్. దేశంలో టాప్ షూటర్లను తయారు చేస్తానని జ‌గ‌పతిబాబు ప్రకటించడంతో ట్రైల‌ర్‌ ప్రారంభమవుతుంది. బ్యాడ్‌ల‌క్ స‌ఖి గా కీర్తి సురేష్(Keerthi Suresh)   ప‌రిచ‌యం అవుతుంది. అయితే  కీర్తి పేరును జ‌గ‌ప‌తిబాబుకు సూచిస్తాడు ఆది పినిశెట్టి. ఇంత‌లో షూటింగ్ మహిళల కోసం కాదు అని గ్రామస్తులు దీనిని వ్యతిరేకిస్తారు. దాంతో  సఖి మళ్లీ దురదృష్టవంతురాలు అని నిరూపించుకుంటుంది. ఫ‌స్ట్ టైమ్ ఆమె టార్గెట్ రీచ్ అవ‌డంతో ఫెయిల్ అవుతుంది. అయితే జ‌గ‌ప‌తి బాబు ఆమెను ల‌క్ష్యాన్ని చేరుకునేవిధంగా ప్రేరేపిస్తారు.

 

స్ఫూర్తిదాయకమైన కంటెంట్ తో ట్రైలర్ అంద‌రినీ ఆకట్టుకుంది. మంచి మెసేజ్ తో పాటు అన్ని కమర్షియల్  హంగులు కూడా చేర్చి ఒక ప‌ర్‌ఫెక్ట్ కమర్షియల్ మూవీగా ఈ సినిమాను మ‌లిచాడు ద‌ర్శ‌కుడు నగేష్ కుకునూర్. చిరంతన్ దాస్ విజువ‌ల్స్, రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్(Devi sri Prasad) మ్యూజిక్ ఈ సినిమాకు స్పెషల్ అట్రాక్షన్ అవ్వబోతున్నాయి.

 

ఇక కీర్తి సురేష్  గురించి స్పెషల్ గా చెప్పేది ఏముంది. ట్రైలర్ చూస్తేనే తెలుస్తుంది. ఆమె విలేజ్ బెల్లె అవతార్ లో సూపర్ కూల్ గా కనిపించింది.  ఆమె ఈ పాత్రను చాలా ఈజ్‌తో చేసింది. కీర్తీ సురేష్(Keerthi Suresh)  కోచ్ గా జ‌గ‌ప‌తిబాబు  తన మార్క్ చూపించబోతున్నట్టు ట్రైలర్ చూస్తే అర్ధం అంతుంది. అటు విలక్షన నటుడు ఆది పినిశెట్టి తన కెరీర్ లో మరో  మంచి గుర్తుండిపోయే పాత్ర‌లో క‌నిపించబోతున్నారు.  

 

`

 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 title Winner: నాగార్జున డైలాగ్‌తో చెప్పి మరీ కప్‌ కొట్టిన కళ్యాణ్‌, ఎమోషనల్‌ కామెంట్‌.. తనూజకే క్రెడిట్‌
Bigg Boss Telugu 9: రమ్య మోక్ష చేత అందరి ముందు క్షమాపణలు చెప్పించిన కళ్యాణ్‌.. పరువు పోయిందిగా