Pushpa: రారా సామి పాటకు డేవిడ్ వార్నర్ పిల్లల స్టెప్పులు.. నవ్వు ఆపుకోలేకపోయిన అల్లు అర్జున్

By Mahesh JujjuriFirst Published Jan 24, 2022, 11:09 AM IST
Highlights

రిలీజ్ అయ్యి రెండు నెలలు కావస్తున్నా పుష్ప(Pushpa) హీట్ ఇంకా తగ్గడం లేదు. ఈ సినిమాలో పాటకు ఎక్కడ లేన క్రేజ్ వచ్చింది. ఇప్పటికీ మన దేశంతో పాటు విదేశాల్లో కూడా పుష్ప పాటల పరంపర కొనసాగుతుంది.

రిలీజ్ అయ్యి రెండు నెలలు కావస్తున్నా పుష్ప(Pushpa) హీట్ ఇంకా తగ్గడం లేదు. ఈ సినిమాలో పాటకు ఎక్కడ లేన క్రేజ్ వచ్చింది. ఇప్పటికీ మన దేశంతో పాటు విదేశాల్లో కూడా పుష్ప పాటల పరంపర కొనసాగుతుంది.

అల్లు అర్జున్(Allu Arjun) పుష్ప సినిమా పాన్ ఇండియా రేంజ్ లో సత్తా చాటింది. ఫస్ట్ టైమ్ పాన్ ఇండియాకు వెళ్ళినందకు.. అల్లు అర్జున్(Allu Arjun)  మంచి రిజల్ట్ సాధించాడు. అది కూడా ఈ కరోనా పాండమింక్ టైమ్ లో కూడా రికార్డ్స్ క్రియేట్ చేసేలా సినిమా సక్సెస్ సాధించింది. దాంతో దిల్ ఖుష్ అవుతున్నాడు అల్లు అర్జున్. ఆయనతో పాటు టీమ్ అంతా ఇప్పుడు ఈ సక్సెస్ ను ఎంజాయ్ చేసే పనిలో ఉన్నారు.

ఇక పుష్ప(Pushpa) సినిమా పాటల రికార్డ్ ల పరంపర కొనసాగుతూనే ఉంది. ఈ పాటలకు మన తెలుగువారి తో పాటు దేశవ్యాప్తంగా మంచి ఊపు వచ్చింది. ఇప్పుడు దేశం దాటి.. విదేశాలకు కూడా ఈ పుష్ప మ్యానియా పాకింది. విదేశీ సెలబ్రిటీలు చాలా మంది పుష్ప సాంగ్స్ తో స్పెషల్ వీడియోలు చేస్తున్నారు. డాన్స్ పరెర్ఫామెన్స్ లు ఇస్తున్నారు, రీసెంట్ గా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్.. పుష్ప టైటిల్ సాంగ్ కు పెర్ఫామెనస్ ఇచ్చాడు. ఇప్పుడు డేవిడి వార్నర్ కూతుర్లు ఇద్దరూ.. రారా సామీ పాటకు అద్భుతంగా డాన్స్ చేసి చూపించారు.

 

డేవిడ్ వార్నర్(David Warner) ఫస్ట్ నుంచి మన టాలీవుడ్ సినిమాలకు.. పాటలకు రెస్పాండ్ అవుతుంటాడు. ఈసారి తనకంటే తన కూతుర్లు ముందే రెస్పాడ్ అయారంటూ.. సామి పాటకు ఇద్దరూ స్విమ్మింగ్ ఫూల్ దగ్గర డాన్స్ వేసిన వీడియోను షేర్ చేసుకున్నారు డేవిడ్ వార్నర్ (David Warner). ఇక తన కూరుర్ల పెర్ఫామెన్స్ కు తెగ మురిసిపోతున్నాడు స్టార్ క్రికెటర్.

ఈ వీడియోకు సెలబ్రిటీలంతా రెస్పాండ్ అవుతున్నారు. సోషల్ మీడియాలో వీడియో చూసిన అల్లు అర్జున్(Allu Arjun) .. ఫుల్ ఇంప్రెస్ అయ్యాడు. సో క్యూట్ అంటూ కామెంట్ పెట్టిన బన్నీ.. పక్కనే నవ్వు ఆపుకోలేకపోతున్నాను అని అర్ధం వచ్చేలా స్మైల్ ఎమ్మోజీని జత చేశాడు. బన్నీతో పాటు చాలా మంది సెలబ్రిటీ స్టార్స్.. ఈ పోస్ట్ కు రెస్పాండ్ అవుతున్నారు. ఈ వీడియోకు ఫిదా అవుతున్న నెటిజన్లు..బన్నీ ఫ్యాన్స్ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.  

click me!