టైటిల్ నాదే.. కౌశల్ కాన్ఫిడెన్స్!

By Udayavani DhuliFirst Published Sep 24, 2018, 11:26 AM IST
Highlights

బిగ్ బాస్ షో పూర్తి కావడానికి మరో వారం రోజులు మాత్రమే మిగిలివుంది. నిన్నటి ఎపిసోడ్ లో రోల్ రైడా ఎలిమినేట్ కాగా.. సామ్రాట్, కౌశల్, దీప్తి, గీతామాధురి, తనీష్ లు ఫినాలేకి చేరుకున్నారు. 

బిగ్ బాస్ షో పూర్తి కావడానికి మరో వారం రోజులు మాత్రమే మిగిలివుంది. నిన్నటి ఎపిసోడ్ లో రోల్ రైడా ఎలిమినేట్ కాగా.. సామ్రాట్, కౌశల్, దీప్తి, గీతామాధురి, తనీష్ లు ఫినాలేకి చేరుకున్నారు. నిన్నటి ఎపిసోడ్ లో బిగ్ బాస్ హౌస్ నుండి క్యాంపెయిన్ మొదలుపెట్టాల్సిందిగా నాని కంటెస్టెంట్స్ ని కోరారు.

ఇందులో భాగంగా కౌశల్ చెప్పిన కథ, టైటిల్ తనదేనని చాలా కాన్ఫిడెన్స్ గా చెప్పడం హాట్ టాపిక్ గా మారింది. కౌశల్ ఓ కథ రూపంలో బిగ్ బాస్ హౌస్ లో తన జర్నీని పోలుస్తూ.. తననొక వీరుడిగా, బిగ్ బాస్ టైటిల్ ని పులిగా వివరిస్తూ.. మిగిలిన హౌస్ మేట్స్ ని తనపై దాడి చేసే వేటగాళ్లుగా వెల్లడించారు.

మిగిలిన వేటగాళ్లు వీరుడిపై బాణాలు విసురుతున్నా.. కసితో వేటాడి పులిని పట్టుకుంటాడు.. అంటూ టైటిల్ తనకే వస్తుందని చాలా నమ్మకంతో చెప్పాడు కౌశల్. అతడు చెప్పిన కథకు ఫిదా అయిన కౌశల్ ఫ్యాన్స్ మరింత ఆనందంతో సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతూ అతడికి మద్దతు తెలుపుతున్నారు. 

ఇది కూడా చదవండి..

బిగ్ బాస్2: రోల్ ఔట్.. టాప్ త్రీలో ఆ ముగ్గురే!

click me!