బిగ్ బాస్2: ఫైనల్స్ లో ఇద్దరు స్టార్ హీరోలు..

Published : Sep 20, 2018, 11:21 AM IST
బిగ్ బాస్2: ఫైనల్స్ లో ఇద్దరు స్టార్ హీరోలు..

సారాంశం

బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ ప్రేక్షకులకి ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇస్తోంది. నాని హోస్ట్ గా చేస్తోన్న ఈ షో వచ్చే వారంతో పూర్తికానుంది. 17 మంది కంటెస్టెంట్లతో మొదలైన ఈ షోలో ప్రస్తుతం ఆరుగురు సభ్యులు మాత్రమే ఉన్నారు.

ఈ వారంలో ఒక కంటెస్టెంట్ ఎలిమినేట్ కానున్నారు. హౌస్ నుండి ఎవరు వెళ్లిపోతారనే ఆసక్తి ప్రేక్షకుల్లో పెరిగిపోతోంది. ఎంతో ఆసక్తికరంగా సాగుతున్న ఈ షో ఫైనల్స్ ని గ్రాండ్ గా నిర్వహించాలని ప్లాన్ చేస్తోంది చిత్రబృందం.

ఇప్పటినుండే దానికి సంబంధించిన ఏర్పాటు ముమ్మరం చేస్తోంది. అతిథులుగా ఇద్దరు స్టార్ హీరోలు ఫైనల్స్ స్టేజ్ మీద కనిపించబోతున్నారని సమాచారం. ఈ క్రమంలో నాగార్జున పేరు బలంగా వినిపిస్తోందో. తాజాగా బిగ్ బాస్ నిర్వాహకులు ఎన్టీఆర్ ని కూడా కలిసినట్లు తెలుస్తోంది. సీజన్ 1 కి హోస్ట్ గా వ్యవహరించిన ఎన్టీఆర్ ని ఫైనల్స్ కి అతిథిగా ఆహ్వానించారట బిగ్ బాస్ నిర్వాహకులు.

ఎన్టీఆర్ కూడా అంగీకారం తెలిపినట్లు సమాచారం. ఇదే గనుక జరిగితే ఒకే వేదికపై నాగార్జున, నాని, ఎన్టీఆర్ ల సందడి మాములుగా ఉండదు. ఆడియన్స్ కి మంచి ఎంటర్టైన్మెంట్ దొరకడం ఖాయం. 

PREV
click me!

Recommended Stories

Virosh Wedding: పెళ్లి తర్వాత తొలిసారి జంటగా విజయ్-రష్మిక..కొత్త జంట సందడి, వైరల్ ఫోటోస్
Vijay Divorce: అవసరమైన ఆ హీరోయిన్ పేరు బయటపెడతా, అప్పటి నుంచే నాకు మానసిక వేదన.. సంగీత సంచలన వ్యాఖ్యలు