బిగ్ బాస్ సెట్ బయట కౌశల్ ఆర్మీ హడావిడి!

Published : Sep 21, 2018, 03:12 PM IST
బిగ్ బాస్ సెట్ బయట కౌశల్ ఆర్మీ హడావిడి!

సారాంశం

బిగ్ బాస్ సీజన్2 లో కంటెస్టెంట్ గా భారీ క్రేజ్ ని సంపాదించాడు కౌశల్. ఇప్పుడు సోషల్ మీడియాలో కౌశల్ కి మాములు ఫాలోయింగ్ లేదు. అతడికోసం ప్రత్యేకంగా తయారైన ఆర్మీ కౌశల్ పై ఎవరైనా నెగెటివ్ కామెంట్స్ చేసినా.. అతడిని ట్రోల్ చేసినా వారిపై విమర్శలు గుప్పిస్తూ దాడికి దిగుతోంది. 

కౌశల్ కోసం ఇటీవల కౌశల్ ఆర్మీ ర్యాలీలు కూడా నిర్వహించారు. బయట కౌశల్ ఆర్మీ చేస్తోన్న హడావిడి గురించి కౌశల్ కి తెలిస్తే ఆయన కూడా ఆశ్చర్యపోవడం ఖాయం. కౌశల్ ని ప్రశ్నిస్తున్నాడని ఆఖరికి హోస్ట్ నానిని సైతం ట్రోల్ చేస్తూ అతడిపై నెగెటివిటీని స్ప్రెడ్ చేస్తున్నారు.

తాజాగా బిగ్ బాస్ సెట్ బయట కౌశల్ ఆర్మీ హంగామా చేసినట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ 20న కౌశల్ కూతురు లల్లి పుట్టినరోజు సందర్భంగా బిగ్ బాస్ హౌస్ ఉన్న అన్నపూర్ణ స్టూడియోస్ కి బయట కౌశల్ మద్దతుదారులు బాణాసంచా కాల్చారు. బుధవారం రాత్రి 12 గంటలకి క్రాకర్స్ కాల్చడం మొదలుపెట్టారు. సోషల్ మీడియాలో ఈ విషయాలను పంచుకున్నారు.

PREV
click me!

Recommended Stories

2025 Box office దగ్గర సునామీ సృష్టించిన చిన్న సినిమాలు, తక్కువ బడ్జెట్ ఎక్కువ కలెక్షన్స్
Mahesh Babu పిల్లలు కింద పడి మరీ నవ్విన వెంకటేష్ సినిమా? ఆ డైరెక్టర్ కు వెంటనే ఛాన్స్ ఇచ్చిన సూపర్ స్టార్