కత్రీనా కైఫ్‌ కి కరోనా.. బెంబెలెత్తిపోతున్న బాలీవుడ్‌

Published : Apr 06, 2021, 07:04 PM IST
కత్రీనా కైఫ్‌ కి కరోనా.. బెంబెలెత్తిపోతున్న బాలీవుడ్‌

సారాంశం

కరోనా బాలీవుడ్‌ని వణికిస్తుంది. దీని దెబ్బకి బాలీవుడ్‌ స్టార్స్ సైతం బెంబెలెత్తిపోతున్నారు. తాజాగా కత్రినా కైఫ్‌కి కరోనా సోకింది. ఈ విషయాన్ని ఈ బ్యూటీ ఇన్‌స్టా స్టోరీస్‌లో వెల్లడించింది. 

ఇటు టాలీవుడ్‌, అటు బాలీవుడ్‌ని కరోనా వణికిస్తుంది. కరోనా సెకండ్‌ వేవ్‌ దెబ్బకి చిత్ర పరిశ్రమలు షేక్‌ అవుతున్నాయి. ఇప్పుడు షూటింగ్‌, సినిమా రిలీజ్‌లు ఊపందుకున్న నేపథ్యంలో సెలబ్రిటీలకు కరోనా సోకుతుంది. తాజాగా కత్రినా కైఫ్‌కి కరోనా సోకింది. ఈ విషయాన్ని ఈ బ్యూటీ ఇన్‌స్టా స్టోరీస్‌లో వెల్లడించింది. `నాకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం హోం క్వారంటైన్‌లో ఉండి వైద్యుల సూచనల మేరకు చికిత్స తీసుకుంటున్నా. అన్ని జాగ్రత్తలు పాటిస్తున్నా. ఇటీవల నన్ను కలిసి వారంతా వెంటనే టెస్ట్ చేయించుకోంది. మీ ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు` అని తెలిపింది కత్రినా. 

దీంతో కత్రీనా త్వరగా కోలుకోవాలని సెలబ్రిటీలు, ఆమె అభిమానులు కోరుకుంటూ పోస్టులు పెడుతున్నారు. ఇటీవల వరుసగా బాలీవుడ్‌ సెలబ్రిటీలు కరోనా బారిన పడుతున్నారు.ఆమీర్ ఖాన్, రణ్‌బీర్ కపూర్, మలైకా అరోరా, ఆలియా భట్, అక్షయ్‌ కుమార్‌, సంజయ్ లీలా భన్సాలీ, మనోజ్ బాజ్‌పాయ్‌, దంగల్ నటి పాతిమా సనా షేక్ వంటి వారికి కరోనా సోకింది. వీరిలో అక్షయ్‌ ఆసుపత్రిలో చేరారు. మిగిలిన వారంతా హోం క్వారంటైన్‌లో ఉన్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం కత్రినా నటించిన `సూర్యవంశీ` విడుదలకు సిద్దంగా ఉంది. దీంతోపాటు `ఫోన్‌ బూత్‌`, `టైగర్‌ 3`చిత్రాల్లో నటిస్తుంది.

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

1300 కోట్లతో బాక్సాఫీస్ క్వీన్ గా నిలిచిన హీరోయిన్ ఎవరు? 2025 లో టాప్ 5 స్టార్స్ కలెక్షన్లు
Demon Pavan Remuneration : 15 లక్షల జాక్ పాట్ తో పాటు, డిమాన్ పవన్ రెమ్యునరేషన్ టోటల్ గా ఎంతో తెలుసా?