బార్బర్ షాప్ లో కత్తెర, బ్రష్ పట్టుకుని కత్రినా కైఫ్ (వీడియో)

By Prashanth MFirst Published Dec 12, 2018, 4:16 PM IST
Highlights

బాలీవుడ్‌ బాద్‌ షా తాజాగా నటించిన కొత్త చిత్రం జీరో. దర్శకుడు ఆనంద్‌ ఎల్‌ రాయ్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో షారూఖ్‌ మరుగుజ్జు పాత్రలో కనిపించబోతున్నాడు.  అనుష్క శర్మ, కత్రినా కైఫ్‌లు ఇందులో హీరోయిన్లుగా నటిస్తున్నారు. డిసెంబర్‌ 21, 2018న చిత్రం విడుదల కానుండటంతో చిత్రం ప్రమోషన్స్ పెంచారు. 

తాజాగా ఈ చిత్రం వీడియో సాంగ్ విడుద‌ల‌యింది. హుస్నా ప‌ర్‌చ‌మ్ అంటూ సాగే ఈ పాట‌ని భూమి త్రివేది..రాజ్ కుమారి పాడారు. ఈ సాంగ్‌లో క‌త్రినా డ్యాన్స్ హైలెట్ గా నిలిచింది. ‘జీరో’ సినిమాలో కత్రినా తన నిజ జీవిత పాత్రనే పోషించారు. ఈ పాటలో కత్రినా కైఫ్ ... ఓ కత్తెర పట్టుకుని బార్బర్ షాప్ లోకి ప్రవేశించటం, అలాగే బ్రష్ తీసుకుని నురగని గెడ్డానికి పట్టించటం వంటి విజువల్స్ తో పాటలోకి ఎంట్రీ ఇస్తుంది.

ఇక గతేడాది షారూఖ్‌ నటించిన రయిస్‌, జబ్ హ్యారీ మెట్ సెజల్ చిత్రాలు, చివరకు గెస్ట్‌ రోల్‌ చేసిన సల్మాన్‌ ట్యూబ్‌లైట్‌ కూడా బోల్తా పడ్డాయి. దీంతో కింగ్‌ ఖాన్‌కు ఇప్పుడు ఓ భారీ బ్లాక్‌ బస్టర్‌ తప్పనిసరి. దాంతో ఈ చిత్రంపైనే ఆశలన్ని పెట్టుకున్నాడు.

click me!