సల్మాన్ తో రిలేషన్షిప్ పై కత్రినా కామెంట్స్!

Published : Sep 23, 2019, 10:23 AM IST
సల్మాన్ తో రిలేషన్షిప్ పై కత్రినా కామెంట్స్!

సారాంశం

సల్మాన్ తో తన బంధం పదహారేళ్లని చెప్పింది కత్రినా. సల్మాన్ చాలా ధృడమైన వ్యక్తి అని.. ఆపదలు, అవసరాలు వచ్చినప్పుడు తోడుండే నేస్తమని.. అతడు తరచూ టచ్ లో ఉండకపోవచ్చు కానీ తన స్నేహితులకు మాత్రం ఎప్పుడూ అండగా ఉంటాడని చెప్పుకొచ్చింది  

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ డేటింగ్ లో ఉన్నారని.. ఆ తరువాత ఇద్దరూ విడిపోయారని బాలీవుడ్ లో ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ విషయంపై స్పందించిన కత్రినా.. సల్మాన్ తో తన బంధం పదహారేళ్లని చెప్పింది.

సల్మాన్ చాలా ధృడమైన వ్యక్తి అని.. ఆపదలు, అవసరాలు వచ్చినప్పుడు తోడుండే నేస్తమని.. అతడు తరచూ టచ్ లో ఉండకపోవచ్చు కానీ తన స్నేహితులకు మాత్రం ఎప్పుడూ అండగా ఉంటాడని చెప్పుకొచ్చింది. 2005లో మొదటిసారి వీరిద్దరూ కలిసి 'మైనే ప్యార్ క్యోం కియా' అనే సినిమా కోసం పని చేశారు.

ఆ తరువాత నుండి వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని వార్తలు ఊపందుకున్నాయి. అవి ఎంతవరకు నిజమో తెలియదు. కానీ ఈ జంట ఎప్పుడూ ఆ వార్తలను ఖండించలేదు. ఆ తరువాత కొన్ని రోజులకు సల్మాన్, కత్రినా విడిపోయినట్లు ప్రచారం జరిగింది. ఆ తరువాత కత్రినా.. రణబీర్ తో ప్రేమాయణం సాగించింది.

ఆ ప్రేమ కూడా ఎక్కువ రోజులు నిలవలేదు. వృత్తి పరంగా మాత్రం సల్మాన్, కత్రినా టాప్ ప్లేస్ లో ఉన్నారు. ఇద్దరూ జంటగా ఎన్నో సినిమాల్లో నటించారు. వీరి కాంబినేషన్ లో వచ్చిన 'ఏక్ థా టైగర్', 'టైగర్ జిందా హై', 'భారత్' వంటి సినిమాలు మంచి విజయాలను అందుకున్నాయి. 

PREV
click me!

Recommended Stories

Krishnam Raju: చిరంజీవి ఇలా మనసు పడ్డాడో లేదో, మెడలో ఖరీదైన గిఫ్ట్ పెట్టిన కృష్ణంరాజు.. మర్చిపోలేని బర్త్ డే
మడత మంచం పై పడుకొని, ప్రకృతిని ఆస్వాదిస్తున్న అనసూయ