జీవితా రాజశేఖర్‌పై దాడి.. నాపై లైంగిక ఆరోపణలు: కత్తి మహేష్

Surya Prakash   | Asianet News
Published : Jun 12, 2021, 03:53 PM IST
జీవితా రాజశేఖర్‌పై దాడి.. నాపై లైంగిక ఆరోపణలు: కత్తి మహేష్

సారాంశం

ప్పట్లో ప్రజారాజ్యం సమయంలో హీరో జీవితారాజశేఖర్ దంపతుల మీద దాడి చేయించింది. జనసేన హయాంలో నా మీద ఒక మహిళతో తప్పుడు ఆరోపణలు చేయించింది.. ప్రముఖ నిర్మాత బన్నీ వాసుగారని తెలిసింది. 

ప్రముఖ నిర్మాత బన్నివాసు నిన్న 11 వ తేదీన పుట్టిన రోజు జరుపుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్బంగా ఆయన ఆప్త మిత్రుడు అల్లు అర్జున్ స్వయంగా ముంబై వెళ్లి మరీ బన్నీ వాసుకి విషెష్ అందించారు.ఈ సంబరాల్లోనుంచి తేలుకోకముందే ఆయనపై ఓ జూనియర్ ఆర్టిస్ట్ తీవ్ర ఆరోపణలు చేసిన వీడియో వైరల్ అవటం మొదలైంది. మరో ప్రక్క.. తాజాగా కత్తి మహేష్ సంచలన పోస్ట్ పెట్టారు.

 ‘అప్పట్లో ప్రజారాజ్యం సమయంలో హీరో జీవితారాజశేఖర్ దంపతుల మీద దాడి చేయించింది. జనసేన హయాంలో నా మీద ఒక మహిళతో తప్పుడు ఆరోపణలు చేయించింది.. ప్రముఖ నిర్మాత బన్నీ వాసుగారని తెలిసింది. అందులో ఎంత నిజం ఉందో వారి మనస్సాక్షికే తెలియాలి. వారికి నా అభినందనలు. ధన్యవాదాలు’ అంటూ ఫేస్ బుక్‌లో పోస్ట్ పెట్టారు కత్తి మహేష్. ఇప్పుడీ పోస్ట్ వైరల్ అవుతోంది. 

అప్పట్లో అంటే 2008 లో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ స్థాపన పెట్టినప్పుడు ఆయనకు రాజకీయానుభవం లేదని జీవితా రాజశేఖర్‌లు విమర్శిచారు. దీనిపై చిరంజీవి అభిమానులు తీవ్రంగా ఆగ్రహించి రాజశేఖర్ ప్రయాణిస్తున్న కారుపై దాడి చేశారు. ఈ దాడిలో రాజశేఖర్ కూతురు శివాని గాయపడింది.  దీంతో వారిపై కేసు పెట్టారు జీవితా రాజశేఖర్ దంపతులు. ఆ తర్వాత 2013లో  వాపస్ తీసుకున్నారు. తమపై దాడి చేసిన వ్యక్తులను గుర్తుపట్టలేకపోతున్నామంటూ కోర్టు ముందు చెప్పారు.  

ఇక 2018లో టాలీవుడ్ క్యాస్టింగ్ కౌచ్ జరుగుతున్నప్పుడు కత్తి మహేష్.. ఓ టీవీ ఛానల్‌ డిబేట్‌లో పాల్గొనగా.. సునీత బోయ అనే జూనియర్ ఆర్టిస్ట్ అదే చర్చలో పాల్గొని కత్తి మహష్‌పై లైంగిక ఆరోపణలు చేయటం జరిగింది. తనను మహేష్ కత్తి ఇంటికి పిలిపించుకుని మరీ బలవంతం చేశాడని చెప్పింది. ఓ టీవీ ప్రోగ్రామ్ కోసం అతనితో మాట్లాడటానికి వెళ్లానని ఆ సమయంలో నన్ను బలత్కారం చేశాడని.. అడ్డుకోబేతే నన్ను కొట్టి తన కామవాంఛ తీర్చుకున్నాడు. ఆ తరువాత తర్వాత బస్ టికెట్‌కి రూ.500 ఇచ్చి పంపించాడని చెప్పింది. ఇప్పుడు కత్తి మహేష్ ఈ రెండు విషయాలను గుర్తు చేసారు తన పోస్ట్ ద్వారా. అయితే అదే అమ్మాయి సునీత బోయ.. గత కొంతకాలంగా నిర్మాత బన్నీ వాసుపై తీవ్ర ఆరోపణలు చేస్తోంది.
 

PREV
click me!

Recommended Stories

Sanjana Remuneration : విన్నర్ రేంజ్ లో పారితోషికం అందుకున్న సంజన గల్రానీ, 15 వారాలు బిగ్ బాస్ హౌస్ లో ఉన్నందుకు ఎంత ఇచ్చారంటే?
Bigg Boss Telugu 9 : తనూజ తో ఐటమ్ సాంగ్ చేయిస్తానన్న ఇమ్మాన్యుయేల్, అడ్డంగా బుక్కైన డీమాన్ పవన్.. హౌస్ లో చివరి రోజు సందడి