స్వగ్రామంలో కత్తి మహేష్‌ అంత్యక్రియలు

Published : Jul 11, 2021, 01:16 PM IST
స్వగ్రామంలో కత్తి మహేష్‌ అంత్యక్రియలు

సారాంశం

కత్తి మహేష్‌ భౌతికకాయానికి నేడు(ఆదివారం) ఆయన స్వగ్రామమైని చిత్తూరు జిల్లా యర్రావారిపాలెం మండలంలోని యలమందలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు ఆయన బంధువులు తెలిపారు. 

ప్రముఖ సినీ విమర్శకుడు, నటుడు, దర్శకుడు కత్తి మహేష్‌ శనివారం సాయంత్రం కన్నుమూసిన విషయం తెలిసిందే. గత నెల జూన్‌ 26న ఆయన రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. పరిస్థితి సీరియస్‌గా ఉండటంతో చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఆయన వైద్య  ఖర్చుల నిమిత్తం ఏపీ ప్రభుత్వం రూ.17లక్షల ఆర్థిక సాయం అందజేసింది. అయిన లాభం లేకపోయింది. దాదాపు 14 రోజులపాటు ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ కత్తి మహేష్‌ శనివారం సాయంత్రం తుది శ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల తెలుగు సినిమా పరిశ్రమతోపాటు సినీ మీడియా సైతం సంతాపం తెలియజేసింది. 

ఇదిలా ఉంటే కత్తి మహేష్‌ భౌతికకాయానికి నేడు(ఆదివారం) ఆయన స్వగ్రామమైని చిత్తూరు జిల్లా యర్రావారిపాలెం మండలంలోని యలమందలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు ఆయన బంధువులు తెలిపారు. కత్తి మహేష్‌కి భార్య సోనాలితోపాటు ఓ కుమారుడున్నారు. కత్తి మహేష్‌ `హృదయం కాలేయం`, `కొబ్బరిమట్ట`,`క్రాక్‌` వంటి చిత్రాల్లో నటించగా, `పెసరట్టు` చిత్రానికి దర్శకత్వం వహించి విమర్శలెదుర్కొన్నాడు. `బిగ్‌బాస్‌`షోతో మరింత గుర్తింపుని తెచ్చుకున్నారు. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

తనూజతో రొమాంటిక్ మూమెంట్స్, సంతోషంతో పొంగిపోయిన కళ్యాణ్.. సంజనకి ఓజీ రేంజ్ ఎలివేషన్
ఆ స్టార్ హీరో వల్ల కెరీర్ నాశనం చేసుకున్న భూమిక, నగ్మా, స్నేహ ఉల్లాల్.. లిస్టులో మొత్తం ఏడుగురు బాధితులు