సీఎం అవుతానన్న పవన్.. కత్తి మహేష్ ఏమన్నాడంటే?

Published : Nov 30, 2018, 09:28 PM IST
సీఎం అవుతానన్న పవన్.. కత్తి మహేష్ ఏమన్నాడంటే?

సారాంశం

అందరి చూపు ప్రస్తుతం తెలంగాణ ఎలక్షన్స్ వైపే ఉన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ ఏ మాత్రం రెస్ట్ లేకుండా ముందుకు సాగుతున్నాడు. జనాలను ఆకర్షిస్తూ జనసేన వర్గాల్లో ఉత్సాహాన్ని నింపుతున్నారు.

అందరి చూపు ప్రస్తుతం తెలంగాణ ఎలక్షన్స్ వైపే ఉన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ ఏ మాత్రం రెస్ట్ లేకుండా ముందుకు సాగుతున్నాడు. జనాలను ఆకర్షిస్తూ జనసేన వర్గాల్లో ఉత్సాహాన్ని నింపుతున్నారు. ఇకపోతే కత్తి మహేష్ మరోసారి జనసేన అధినేతపై వ్యాఖ్యలు చేయడం కొన్ని మీడియాల్లో వైరల్ గా మారాయి. 

సీఎం అవుతాను అని పవన్ జనాల్ని ఉద్దేశించి మాట్లాడగా దానిపై కత్తి డిఫరెంట్ గా ఫెస్ బుక్ లో కామెంట్ చేశాడు. పవన్ కళ్యాణ్ ఏమన్నాడంటే "పిఠాపురంలో జనం సీఎం అని నాకోసం నినదిస్తే, అది శ్రీపాద వల్లభుడి ఆశీర్వాదమే. నేను సీఎం అయిపోతాను."  అని బహిరంగ సభలో వివరణ ఇచ్చాడు. ఈ వ్యాఖ్యలను ఉద్దేశిస్తూ కత్తి మహేష్ ఫెస్ బుక్ ద్వారా ఈ విధంగా స్పందించాడు. 

"ఇదేమన్నా సినిమా ఫంక్షన్ అనుకున్నావా బాబూ! జనం అరిస్తే, దేవుడు దయతలిస్తే హిట్ అయిపోవడానికి. సినిమాక్కూడా కథ బాగుండాలి. బాగా తియ్యాలి. రాజకీయంలో నువ్వేమిటో తెలియాలి. ఏం చేస్తావో చెప్పాలి. అది చెయ్యగలనని నమ్మించాలి. నీ తరఫున నిలబడిన వాళ్ళు మెజారిటీ గెలవాలి. అప్పుడు నువ్వు సీఎం అవుతావ్. తెలుసుకో!" అంటూ కత్తి మహేష్ పేర్కొన్నారు. 

PREV
click me!

Recommended Stories

Chiranjeevi: సౌందర్య సినిమా చూసి చేతులు కాల్చుకున్న చిరంజీవి, ఇదెక్కడి గొడవరా అని తలపట్టుకున్న డైరెక్టర్
హృతిక్ రోషన్ 'క్రిష్' సినిమాలో ధోని భార్య నటించిందా?