
తెలుగు తెరపై పౌరాణికాల ద్వారా ఎన్టీఆర్ .. సాంఘికాల ద్వారా ఏఎన్నార్ తమదైన ముద్రవేస్తే, జానపదాలపై కాంతారావు తనదైన ముద్ర వేసిన విషయం సినిమా ప్రియులకు తెలిసిందే. జానపదం అనగానే సహజంగానే కత్తి యుద్ధాలు ఉంటాయి .. ఆ కత్తి యుద్ధాల్లో ఆరితేరిన హీరోగా మార్కులు కొట్టేసిన కాంతారావును, అభిమానులు 'కత్తి కాంతారావు' అనే పిలుచుకునేవారు.
అలాంటి కాంతారావు జీవితచరిత్రను సీనియర్ దర్శకుడు పీసీ ఆదిత్య రూపొందిస్తున్నాడు. కాంతారావు జీవితంలోని వివిధ కోణాలను తెరపై ఆవిష్కరించడానికి ఆయన సిద్ధమవుతున్నాడు. 'రాకుమారుడు' అనే టైటిల్ ను ఖరారు చేసిన ఆయన, పాటల రికార్డింగ్ ను పూర్తి చేశాడు. ఈ నేపధ్యంలో ఈ చిత్రంలోని కాంతారావు లుక్ ఫొటో షూట్ ఫొటోలు లీక్ అయ్యాయి. ఇక్కడ మీరు చూస్తున్నవి ఆ ఫోటోలే. కాంతారావుగా అఖిల్ సన్ని అనే కుర్రాడు చేస్తున్నాడు.
త్వరలో రెగ్యులర్ షూటింగుకి వెళ్లడానికి అవసరమైన సన్నాహాలు చేసుకుంటున్నాడు. కాంతారావు పాత్రకు గాను అఖిల్ సన్నీ అనే యువకుడిని ఎంపిక చేసుకున్నారు. ఎన్టీఆర్ .. ఏఎన్నార్ .. రాజనాల .. దర్శకుడు విఠలాచార్య .. కృష్ణకుమారి .. రాజశ్రీ .. పాత్రలకి గాను నటీనటుల ఎంపిక జరగవలసి వుంది.