అసహ్యం అంటూ “టైటానిక్”పై హీరోయిన్ షాకింగ్ కామెంట్

Surya Prakash   | Asianet News
Published : Jan 08, 2021, 04:37 PM ISTUpdated : Jan 08, 2021, 05:41 PM IST
అసహ్యం అంటూ “టైటానిక్”పై హీరోయిన్ షాకింగ్ కామెంట్

సారాంశం

 అయితే తనకు ఎంతో పాపులారిటీ తెచ్చిన సినిమాను చూడటం అంటే అసహ్యం అంటోంది కేట్‌. ఈ సినిమాను ఇప్పుడు సిగ్గుపడకుండా చూడలేనని అంటున్నారు. ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ విషయాన్ని చెప్పుకొచ్చారు.    

“టైటానిక్” ఈ పేరు వినని సినీ ప్రేమికులు ఉండరు. హాలీవుడ్ లో రూపొందిన ఈ ప్రేమ కథా చిత్రం గురించి ఇప్పటికి ఎక్కడో చోట డిస్కషన్ జరుగుతూనే ఉంటుంది. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన టైటానిక్ ఫిప్ సముద్రంలో ఎలా మునిగిపోయిందో చూపుతూ ఈ ప్రేమ కథా చిత్రం సాగుతుంది. హాలీవుడ్ ప్రముఖ దర్శక నిర్మాత జేమ్స్ కామెరాన్ ఈ చిత్రాన్ని రూపొందించారు. చరిత్రలో నిలిచిపోయిన విషాద గాధ. తరాలు మారినా ఈ సినిమాకి ఉన్న ప్రాముఖ్యత మాత్రం తగ్గలేదు. అలాగే ఈ సినిమాతో పాటు  ఇందులో నటించిన హీరోయిన్‌ కేట్‌ విన్‌స్లెట్‌ అందరికీ అభిమాన హీరోయిన్ అయ్యిపోయింది. ఆ సినిమా ఆమెకు ఓ రేంజిలో పాపులారిటీ తెచ్చిపెట్టింది. 

 అయితే తనకు ఎంతో పాపులారిటీ తెచ్చిన సినిమాను చూడటం అంటే అసహ్యం అంటోంది కేట్‌. ఈ సినిమాను ఇప్పుడు సిగ్గుపడకుండా చూడలేనని అంటున్నారు. ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ విషయాన్ని చెప్పుకొచ్చారు.  

ఇక 1997లో రిలీజైన ఈ సినిమాలో లియోనాల్డో డెకాప్రియో, కేట్‌ విన్‌స్లెట్‌లు ప్రధాన పాత్రల్లో నటించారు. 14 విభాగాల్లో ఆస్కార్‌కు నామినేట్‌ అయిన ఈ సినిమా 2 అవార్డులను సొంతం చేసుకుంది. ఆ సంవత్సరానికి అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. దాదాపు చాలా సంవత్సరాల తర్వాత జేమ్స్‌ కామెరూన్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘అవతార్‌’ సీక్వెల్‌లో కేట్‌ నటిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణలో భాగంగా అరుదైన రికార్డు సృష్టించారు కేట్‌. ‘అవతార్‌’ సీక్వెల్స్‌ కథాంశం ప్రకారం అండర్‌ వాటర్‌ (నీటి లోపల) కూడా షూటింగ్ జరిపారు. ఇందులో భాగంగా కేట్‌ విన్స్‌లెట్‌ నీటి లోపల 7 నిమిషాల 14 సెకన్లు ఉన్న ఓ సన్నివేశంలో నటించారు. దీనికోసం సుమారు నాలుగువారాల పాటు శిక్షణ తీసుకున్నారు.
 

PREV
click me!

Recommended Stories

Rashmika Mandanna: ఫ్రెండ్స్ తో శ్రీలంక ట్రిప్ ఎంజాయ్ చేస్తున్న రష్మిక, ఇది బ్యాచిలరేట్ పార్టీనా ?
Director KK Passed Away: నాగార్జున `కేడి` మూవీ డైరెక్టర్‌ కన్నుమూత.. సందీప్‌ రెడ్డి వంగాకి ఈయనే గురువు