రామ్ ని టార్గెట్ బెల్లంకొండ డెసిషన్

By Surya Prakash  |  First Published Jan 8, 2021, 4:36 PM IST

ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమాని జనవరి 14న రిలీజ్ చేయటానికి నిర్ణయించారు. రామ్ నటిస్తున్న ‘రెడ్’ మూవీని జనవరి 14న విడుదల చేస్తున్నారు చిత్రయూనిట్. అదే రోజు ‘అల్లుడు అదుర్స్’ కూడా రిలీజ్ కానుందని తెలుస్తుంది. కానీ ఇంకా ‘అల్లుడు అదుర్స్’ ప్రీపోస్టుపోన్ గురించి అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. ఈ వారంలో ఎప్పుడైనా రిలీజ్ డేట్ ను ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. గతంలో రామ్ హీరోగా ఇదే దర్శకుడుతో కందిరీగ చిత్రం వచ్చి సక్సెస్ అయ్యింది. 


బెల్లంకొండ శ్రీనివాస్‌ హీరోగా సంతోష్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ ‘అల్లుడు అదుర్స్‌’. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 15న ప్రేక్షకుల ముందుకు రానుందని ఇప్పటికే ప్రకటన వచ్చింది. అయితే లాస్ట్ మినిట్ లో రిలీజ్ డేట్ మారింది. ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమాని జనవరి 14న రిలీజ్ చేయటానికి నిర్ణయించారు. రామ్ నటిస్తున్న ‘రెడ్’ మూవీని జనవరి 14న విడుదల చేస్తున్నారు చిత్రయూనిట్. అదే రోజు ‘అల్లుడు అదుర్స్’ కూడా రిలీజ్ కానుందని తెలుస్తుంది. కానీ ఇంకా ‘అల్లుడు అదుర్స్’ ప్రీపోస్టుపోన్ గురించి అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. ఈ వారంలో ఎప్పుడైనా రిలీజ్ డేట్ ను ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. గతంలో రామ్ హీరోగా ఇదే దర్శకుడుతో కందిరీగ చిత్రం వచ్చి సక్సెస్ అయ్యింది. 

 ‘శీనుగాడు నా ఫ్రెండ్‌.. యాక్షన్‌ సీక్వెన్స్‌లో వాడిది సపరేట్‌ ట్రెండ్‌.. ఇక్కడ హ్యాష్‌ ట్యాగ్స్‌ లేవమ్మా..’ అంటూ వెన్నెల కిషోర్‌ చెబుతున్న డైలాగ్స్ ఫన్నీగా ఉన్నాయి. నభా నటేశ్‌, అను ఇమ్మాన్యుయేల్‌ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాలో ప్రకాశ్‌రాజ్‌, సోనూసూద్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. సుమంత్‌ మూవీ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై సుబ్రహ్మణ్యం ఈ సినిమాను నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం సమకూరుస్తున్నారు. 

Latest Videos

ఇక ప్రస్తుతం రేపు అంటే ఈ తొమ్మదిన రవితేజ క్రాక్ విడుదల అవుతోంది. అలాగే 14 సంక్రాతి రోజున రాబోతున్న రామ్ రెడ్ , బెల్లంకొండ అల్లుడు అదుర్స్ 50 శాతం ప్రేక్షకులతోనే థియేటర్స్  లోకి దిగుతున్నాయి. మరో ప్రక్క మాస్టర్ విడుదలకు సిద్దమైంది
 

click me!