పవన్ కళ్యాణ్ కాటమరాయుడు టీజర్ విడుదల రేపే..

Published : Feb 03, 2017, 09:15 AM ISTUpdated : Mar 26, 2018, 12:02 AM IST
పవన్ కళ్యాణ్ కాటమరాయుడు టీజర్ విడుదల రేపే..

సారాంశం

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా డాలీ దర్శకత్వంలో వస్తున్న చిత్రం కాటమరాయుడు ఫిబ్రవరి 4న కాటమరాయుడు టీజర్ రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేసిన టీమ్

పవన్ కళ్యాణ్ హీరోగా డాలీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం “కాటమరాయుడు”. ఇప్పటికే శర వేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంలో పవన్ సరసన గబ్బర్ సింగ్ తర్వాత మరో సారి హాట్ భామ శృతి హసన్ హీరోయిన్ గా నటిస్తోంది. అయితే ఈ మధ్య సంక్రాంతి సందర్బంగా విదులైన ఈ చిత్రం ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్స్ తో సినిమా పై అంచనాలు భారిగా పెరిగాయి.

దీంతో పవన్ అభిమానులు ఈ చిత్రం ఫస్ట్ లుక్ టిజర్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే గత నెలలోనే విడుదల కావాల్సిన ఈ చిత్రం ఫస్ట్ లుక్ టిజర్ ఎట్టకేలకు రేపు ఫిబ్రవరి 4న సాయంత్రం 4 గంటలకు విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న నార్త్ స్టార్  ఎంటర్టైన్ మెంట్ సంస్థ తమ అఫీషియల్ ట్వీట్టర్ పేజ్ ద్వారా ఈ విషయాన్ని తెలియజేసింది.

PREV
click me!

Recommended Stories

శోభన్ బాబు ను సెట్ లో చూసి, ఎంత హ్యాండ్సమ్ గా ఉన్నారు అని.. ఇంప్రెస్ అయిన హీరోయిన్ ఎవరో తెలుసా?
Gunde Ninda Gudi Gantalu Today: టాలెంట్ ప్రూవ్ చేసుకున్న మీనా, పోటీకి పోయి కాళ్లు విరగ్గొట్టుకున్న ప్రభావతి