మళ్లీ అప్పుడే మొదలెట్టేసిన కాటమరాయుడు

Published : Jan 28, 2017, 11:05 AM ISTUpdated : Mar 25, 2018, 11:58 PM IST
మళ్లీ అప్పుడే మొదలెట్టేసిన కాటమరాయుడు

సారాంశం

పవన్ కళ్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం కాటమరాయుడు సర్దార్ గబ్బర్ సింగ్ తర్వాత పవన్ నటిస్తున్న చిత్రం గబ్బర్ సింగ్ ఫెయిలైనా తగ్గని పవర్ స్టార్ సినిమాల క్రేజ్ బాహుబలి తర్వాత అత్యధిక మొత్తానికి కాటమరాయుడు రైట్స్

సర్దార్ గబ్బర్ సింగ్  డిజాస్టర్ అయిన తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ కాటమరాయుడు. గోపాల గోపాల ఫేం డాలీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ఫ్యాక్షనిస్ట్ పాత్రలో కనిపించనున్నాడు. తమిళ సినిమా వీరం కు రీమేక్ తెరకెక్కుతున్న ఈ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్గా నటిస్తోంది. ప్రస్తుతం షూటింగ్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాను ఉగాది కానుకగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

సినిమా విడుదలయ్యేందుకు ఇంకా రెండు నెలల సమయం ఉన్నా.. ఇప్పటి నుంచే బిజినెస్ మొదలెట్టారని తెలుస్తోంది. అంతేకాదు ఈ సినిమా సీడెడ్ రైట్స్ భారీ మొత్తానికి అమ్ముడయ్యాయన్న ప్రచారం జరుగుతోంది. సర్థార్ గబ్బర్సింగ్ లాంటి డిజాస్టర్ తరువాత పవన్ హీరోగా తెరకెక్కిన సినిమా అయినా కాటమరాయుడు బిజినెస్ పరంగా దూసుకుపోతోంది.

సీడెడ్ బాహుబలి తరువాత అత్యధిక మొత్తానికి కాటమరాయుడు రైట్స్ అమ్ముడవ్వడం పవర్ స్టార్ ఫ్యాన్స్ కు కిక్ ఇస్తోంది. పవన్ సన్నిహితుడు శరత్ మరార్ నిర్మిస్తున్న ఈ సినిమాకు అనూప్ రుబెన్స్ సంగీతం అందిస్తున్నాడు.

PREV
click me!

Recommended Stories

అక్కను మించిపోయిన `ఊ అంటావా` సింగర్‌.. ఒక్క సాంగ్‌తో పాన్ ఇండియా సింగర్‌ అయిన మంగ్లీ చెల్లి తెరవెనుక స్టోరీ
Chiranjeevi: చిరంజీవి కంటే ఆ హీరోకే హిట్లు ఎక్కువ.. కట్ చేస్తే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరీర్ పరిమితం