నెల రోజులకంటే ముందే ఓటీటీలో రీసెంట్‌ సూపర్‌ హిట్‌.. ఈ క్రేజీ థ్రిల్లర్‌ని ఎందులో, ఎప్పుడు చూడొచ్చంటే?

Published : Jun 24, 2024, 11:18 PM IST
నెల రోజులకంటే ముందే ఓటీటీలో రీసెంట్‌ సూపర్‌ హిట్‌.. ఈ క్రేజీ థ్రిల్లర్‌ని ఎందులో, ఎప్పుడు చూడొచ్చంటే?

సారాంశం

ఇటీవల చాలా సినిమాలు థియేటర్లలో విడుదలైన నెల రోజుల లోపే ఓటీటీలోకి వస్తున్నాయి. ఇప్పుడు రీసెంట్‌ హిట్‌ థ్రిల్లర్‌ సైతం ఓటీటీలోకి రాబోతుంది.   

ఇటీవల వచ్చిన చాలా సినిమాలు వెంటనే ఓటీటీలో వస్తున్నాయి. ఇంకా చెప్పాలంటే ఓటీటీలో రావడం కోసమే థియేటర్లలో విడుదలవుతున్నాయి. ఓటీటీ సంస్థలు తాము కొన్న సినిమాలు కచ్చితంగా థియేటర్లలో విడుదల కావాలని, అలాంటి సినిమాలనే కొంటామని నిబంధనలు పెడుతున్నారట. వాటి కోసం తమ సినిమాలను జస్ట్ థియేటర్లలో విడుదల చేసి, ఆ వెంటనే ఓటీటీలో విడుదల చేస్తున్నారు నిర్మాతలు. మిడ్‌ రేంజ్‌ నుంచి, స్మాల్‌ సినిమాల విషయంలో ప్రస్తుతం ఇదే జరుగుతుంది. 

ఈ నేపథ్యంలో ఇప్పుడు ఓ హిట్‌ సినిమా ఓటీటీలోకి రాబోతుంది. థియేటర్లో విడుదలైన నెల రోజుల లోపే ఓటీటీలో విడుదలకు రెడీ అయ్యారు. అదేంటో కాదు కార్తికేయ నటించిన `భజే వాయు వేగం` మూవీ. ఈ సినిమా గత నెల 31న థియేటర్లలో విడుదలైంది. మంచి స్పందన తెచ్చుకుంది. విశ్వక్‌ సేన్‌ `గ్యాంగ్స్ ఆఫ్‌ గోదావరి`, ఆనంద్‌ దేవరకొండ `గంగం గణేశా`తో పోటీ పడి విడుదలైంది. ఈ మూడింటిలోనే ఈ చిత్రమే హిట్‌ టాక్ తెచ్చుకుని ఆడియెన్స్ ని అలరించింది. 

ఈ నేపథ్యంలో ఇప్పుడి నెల రోజులకు ముందే ఓటీటీలో స్ట్రీమింగ్‌ కానుంది. ఈ నెల 28 నుంచి దీన్ని నెట్‌ ఫ్లిక్స్ లో టెలికాస్ట్ చేయబోతున్నారు. తాజాగా ఈ విషయాన్ని టీమ్‌ అధికారికంగా వెల్లడించింది. థియేటర్లలో బాగానే మెప్పించిన ఈ చిత్రం ఇక ఓటీటీ ఆడియెన్స్ ని అలరించేందుకు వస్తుందని చెప్పొచ్చు. ఈ సినిమా ఓటీటీ రిలీజ్‌ డేట్‌ని ప్రకటించిన సందర్భంగా హీరో కార్తికేయ రియాక్ట్ అవుతూ, థియేటర్స్ లో మా "భజే వాయు వేగం" సినిమాకు ప్రేక్షకులంతా తమ ప్రేమను అందించారు. అదే ప్రేమను మేము నెట్ ఫ్లిక్స్ ద్వారా మీ ఇంటికే వచ్చి తిరిగి ఇవ్వబోతున్నాం` అని ట్వీట్ చేశారు.

`భజే వాయు వేగం` సినిమాలో ఐశ్వర్య మీనన్ హీరోయిన్ గా నటించింది. `హ్యాపీ డేస్` ఫేమ్ రాహుల్ టైసన్ కీలక పాత్రను పోషించారు. ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్ కథతో దర్శకుడు ప్రశాంత్ రెడ్డి ఈ చిత్రాన్ని రూపొందించారు. అజయ్ కుమార్ రాజు.పి. కో ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు. ఇందులో కార్తికేయ, రాహుల్‌ టైసన్‌ అన్నదమ్ములు. జాబ్‌ కోసం హైదరాబాద్‌ వస్తారు. కానీ సెటిల్‌ కాలేక చిన్న చిన్న జాబ్‌లు చేస్తారు. రాహుల్‌ స్టార్‌ హోటల్లో వెయిటర్‌గా, కార్తికేయ బెట్టింగ్‌లు ఆడుతుంటాడు. క్రికెటర్‌గా రాణించాలనే డ్రీమ్‌ డబ్బు కారణంగా చెదిరిపోతుంది. కానీ తమ పరిస్థితి ఊర్లో ఇంటి వద్ద ఉన్న నాన్న తనికెళ్ల భరణికి చెప్పకూడదని, ఆయన వచ్చినప్పుడు రాయల్‌ లుక్‌లో మ్యానేజ్‌ చేస్తుంటారు. కానీ మధ్యలో వీరి విషయం తెలిసి నాన్న అనారోగ్యం పాలవుతాడు. దానికి కారణం పురుగుల మందులే అని తేలుతుంది. ఆపరేషన్‌ చేయాలంటే ఇరవై లక్షలు కావాలి. దానికోసం బెట్టింగ్‌ ఆడతాడు కార్తికేయ. కానీ బెట్టింగ్‌ హోనర్‌ మోసం చేస్తాడు. ఈ క్రమంలో తండ్రి ని కాపాడుకునేందుకు ఇద్దరు అన్నదమ్ములు చేసిన పోరాటమే ఈ సినిమా కథ. 
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

హీరోలంతా లైన్‌ వేయడానికే అప్రోచ్‌ అవుతారని ఏకంగా స్టార్‌ హీరోని అవాయిడ్‌ చేసిన అనసూయ
జైలర్ 2 లో తమన్నాకి నో ఛాన్స్.. రజినీకాంత్ తో ఐటెం సాంగ్ లో స్టెప్పులేయబోతున్న బ్యూటీ ఎవరో తెలుసా ?