కార్తికేయ ‘గుణ 369’టీజర్ వచ్చేసింది

By AN TeluguFirst Published Jun 17, 2019, 12:06 PM IST
Highlights

‘ఆర్‌ ఎక్స్ 100 ’ ఫేమ్‌ కార్తికేయ హీరోగా రూపొందుతోన్న తాజా చిత్రం ‘గుణ 369’. 

 

‘ఆర్‌ ఎక్స్ 100 ’ ఫేమ్‌ కార్తికేయ హీరోగా రూపొందుతోన్న తాజా చిత్రం ‘గుణ 369’. స్ప్రింట్‌ ఫిలిమ్స్‌,  జ్ఞాపిక ఎంటర్‌టైన్‌మెంట్స్, సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రమిది. అనిల్‌ కడియాల, తిరుమల్‌ రెడ్డి నిర్మాతలు. ఈ సినిమాతో అర్జున్‌ జంధ్యాల దర్శకుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్నారు.  శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకుంటున్న ఈ చిత్రం ప్రమోషన్స్ పైనా దృష్టి పెట్టింది. ఈ సినిమా టీజర్ ఈ రోజు విడుదల చేసారు. 

రీసెంట్ గా వచ్చిన హిప్పీ చిత్రం డిజాస్టర్ కావటంతో కార్తికేయ ఈ సినిమాపైనే తన ఆశలు అన్నీ పెట్టుకున్నారు. ఈ నేపధ్యంలో వచ్చిన ఈ టీజర్ కాస్త డిఫరెంట్ గా ఉంది. యాక్షన్ ఎంటర్టైనర్ తో కూడిన లవ్ స్టోరీ అని టీజర్ ని బట్టి అర్దమవుతోంది. అయితే టైటిల్ కు  సంభందించిన క్లూ మాత్రం ఈ టీజర్ ఇవ్వలేదు. మీరూ టీజర్ పై ఓ లుక్కేయండి.

హీరో కార్తికేయ మాట్లాడుతూ ‘కొన్ని క‌థ‌లు విన‌గానే న‌చ్చుతాయి. మ‌ళ్లీ మ‌ళ్లీ గుర్తుకొస్తుంటాయి. న‌లుగురితో పంచుకోవాల‌నిపిస్తుంటాయి. నాకు అర్జున్ జంధ్యాల చెప్పిన క‌థ అలాంటిదే. విన‌గానే న‌చ్చింది. బెస్ట్ స్టోరీ టు టెల్ అనిపించింది. ఇప్పటిదాకా తీసిన‌ ర‌షెస్ చూసుకున్నాం. ప్రతి ఫ్రేమూ రియ‌లిస్టిక్‌గా వ‌చ్చింది’ అన్నారు. 

ద‌ర్శకుడు మాట్లాడుతూ ‘ మా చిత్రంలో హీరో పేరు గుణ‌. ‘369’ అంటే ఏంట‌నేది స్క్రీన్ మీదే చూడాలి. ఇటీవ‌లే క్రొయేషియాలో 2 పాట‌లు తీశాం. ఔట్ పుట్ చాలా బాగా వ‌స్తోంది’ అని అన్నారు.

 

click me!