ట్రిమ్ చేస్తే కానీ కిక్ ఇవ్వలేదన్నమాట..`చావు కబురు చల్లగా`

By Surya PrakashFirst Published Apr 28, 2021, 3:22 PM IST
Highlights

కార్తికేయ, లావణ్య త్రిపాఠి హీరోహీరోయిన్లుగా రూపొందించిన చిత్రం ‘చావు కబురు చల్లగా’. జిఏ2 పిక్చర్స్‌ బ్యానర్‌పై బన్నీవాస్‌ నిర్మించిన ఈ చిత్రాన్ని పెగళ్లపాటి కౌళిక్‌ తెరకెక్కించారు. 

యంగ్‌ హీరో కార్తికేయ, హీరోయిన్‌ లావణ్య త్రిపాఠి జంటగా నటించిన చిత్రం 'చావు కబురు చల్లగా’. గీతాఆర్ట్స్ నిర్మాణంలో రూపొందిన ఈ సినిమా భారీ అంచనాలతో రిలీజైంది. అయితే మార్నింగ్ షోకే డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. హీరో కూడా సారీ చెప్పే పరిస్దితి తెచ్చుకుంది. అయితే ఇప్పుడా సినిమా ఓటీటిలో ప్రత్యక్ష్యమైంది. ఓటీటీ కోసం ఈ చిత్రాన్ని రీ ఎడిట్‌ చేసి, నిడివి తగ్గించారు. ఓటీటీ కోసం ఈ చిత్రాన్ని రీఎడిట్‌ చేసినట్లు చిత్ర దర్శకుడు కౌశిక్‌ తెలిపారు. ఆయన అనుకున్న పాయింట్‌ అంతగా రీచ్‌ కాలేకపోవటంతో.. ఇంకా బెటర్ గా ట్రిమ్ చేసినట్లుగా దర్శకుడు చెప్పుకొచ్చారు. 

 ప్రముఖ ఓటీటీ ‘ఆహా’ వేదికగా ఏప్రిల్‌ 23న ప్రేక్షకుల ముందుకు వచ్చి అందరినీ ఆకట్టుకుంటోంది. విడుదలైన 72 గంటల్లో 100 మిలియన్‌ వ్యూయింగ్‌ మినిట్స్‌ సొంతం చేసుకుందని ‘ఆహా’ స్వయంగా తెలిపింది.  ఈ సినిమా ఓటీటీ లో మంచి ఆదరణ పొందడంతో చిత్రయూనిట్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఈ సినిమాలో లావణ్య త్రిపాఠి భర్త కోల్పోయిన వితంతువుగా కనిపిస్తుంది. హీరో కార్తికేయ అంబులెన్స్ డ్రైవర్ గా పని చేస్తుంటారు.  వీరిద్దరి మధ్య చోటుచేసుకునే ఒక విచిత్రమైన ప్రేమకథా నేపథ్యంలో చావు కబురు చల్లగా సినిమా తెరకెక్కింది. ఈ చిత్రానికి కౌశిక్‌ పెగళ్లపాటి దర్శకత్వం వహించారు.  జీఏ2 పిక్చర్స్‌ పతాకంపై బన్ని వాసు ఈ చిత్రాన్ని నిర్మించారు. అల్లు అరవింద్‌ సమర్పించారు. ఆమని, మురళీశర్మ, శ్రీకాంత్‌ అయ్యంగార్‌ తదితరులు కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమాకు జేక్స్‌ బిజోయ్‌ స్వరాలు సమకూర్చారు. బస్తీ బాలరాజు పాత్రలో కార్తికేయ ఒదిగిపోయి నటించారు. ఇక భర్త కోల్పోయిన యువతి పాత్రలో లావణ్య మెప్పించింది.

click me!