`పెళ్లి సందD`నుంచి తొలి పాట వచ్చేసింది.. దర్శకేంద్రుడి మార్క్ కనిపిస్తుందిగా!

Published : Apr 28, 2021, 01:18 PM ISTUpdated : Apr 28, 2021, 01:20 PM IST
`పెళ్లి సందD`నుంచి తొలి పాట వచ్చేసింది.. దర్శకేంద్రుడి మార్క్ కనిపిస్తుందిగా!

సారాంశం

శ్రీకాంత్‌ తనయుడు రోషన్‌ హీరోగా, ఆయన సరసన శ్రీ లీల కథానాయికగా నటిస్తున్న `పెళ్లిసందD` చిత్రంలోని తొలి పాట `ప్రేమంటే ఏంటి?`ని తాజాగా బుధవారం విడుదల చేశారు. హరిచరణ్‌, శ్వేతా పండిట్‌ ఆలపించారు. 

`పెళ్లిసందD` పేరుతో కె.రాఘవేంద్రరావు ఓ సినిమాని తెరకెక్కిస్తున్న విషయం తెలిసింది. ఆయన రూపొందించిన మ్యూజికల్‌ హిట్‌ `పెళ్లిసందడి`ని ఇన్‌స్పైరింగ్‌గా తీసుకుని ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. గౌరి రోనంకి దర్శకత్వం వహిస్తున్నారు. కె. రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణ చేస్తున్నారు. ఇందులో శ్రీకాంత్‌ తనయుడు రోషన్‌ హీరోగా నటిస్తున్నాడు. ఆయన సరసన శ్రీ లీల కథానాయికగా చేస్తుంది. తాజాగా ఈ చిత్రంలోని తొలి పాట `ప్రేమంటే ఏంటి?`ని తాజాగా బుధవారం విడుదల చేశారు. హరిచరణ్‌, శ్వేతా పండిట్‌ ఆలపించారు. ఏప్రిల్‌ 28 టాలీవుడ్‌లో చాలా ప్రత్యేకమైన రోజు కావడంతో ఈ రోజున ఈ పాటని ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదల చేశారు. 

తాజాగా విడుదలైన ఈ రొమాంటిక్‌, లవ్‌ సాంగ్‌ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. దీనికి ఎం.ఎం కీరవాణి సంగీతం అందించారు. శేఖర్‌ మాస్టర్‌ కొరియోగ్రఫీ చేస్తున్నారు. పాట శ్రోతలను మెప్పిస్తుంది. ఇందులో రోషన్‌, శ్రీలీల ప్రజెంట్‌గా కనిపిస్తున్నారు. ఇక రొమాంటిక్‌ మ్యూజికల్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.సినిమా షూటింగ్‌ దాదాపు పూర్తయ్యింది.కరోనా తగ్గుముఖం పట్టాక విడుదలకు ప్లాన్‌ చేస్తున్నారు.  ఈ చిత్రానికి సినిమాటోగ్ర‌ఫి: సునీల్ కుమార్‌, 
సాహిత్యం: చంద్ర‌బోస్
, ఆర్ట్‌: కిర‌ణ్
, ఎడిట‌ర్‌: త‌మ్మిరాజు, 
‌ఫైట్స్‌: వెంక‌ట్
, కొరియోగ్ర‌ఫి: శేఖ‌ర్ వీజే, 
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌: కె. సాయిబాబా‌
, బేన‌ర్స్‌: ఆర్‌కే ఫిలిం అసోసియేట్స్‌, ఆర్కా మీడియా వ‌ర్క్స్, 
స‌మ‌ర్ఫ‌ణ‌: కె. కృష్ణ‌మోహ‌న్ రావు‌
, నిర్మాత‌లు: మాధ‌వి కోవెల‌మూడి, శోభు యార్ల‌గడ్డ‌, ప్ర‌సాద్ దేవినేని

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

చిరంజీవి ఫ్రెండ్ తో లవ్ ఎఫైర్ పెట్టుకున్న స్టార్ హీరోయిన్ ? పెళ్లి కాకుండా ఒంటరిగా మిగిలిపోయింది
చిరంజీవి, అనిల్ రావిపూడి రెమ్యునరేషన్స్ కే బడ్జెట్ మొత్తం అయిపోయిందా ? ఇక సినిమా పరిస్థితి ఏంటి ?