కేంద్ర మంత్రి పుట్టిన ఊరిని దత్తత తీసుకున్న `కార్తికేయ 2` నిర్మాత.. విమర్శలు..

Published : Oct 29, 2022, 12:53 PM IST
కేంద్ర మంత్రి పుట్టిన ఊరిని దత్తత తీసుకున్న `కార్తికేయ 2` నిర్మాత.. విమర్శలు..

సారాంశం

`ది కాశ్మీర్‌ ఫైల్స్`, `కార్తికేయ 2` చిత్రాలతో వరుస బ్లాక్‌ బస్టర్స్ అందుకున్న నిర్మాత అభిషేక్‌ అగర్వాల్‌ ఊరిని దత్తత తీసుకున్నారు. ఆయన మంత్రి పుట్టిన ఊరిని అడాప్ట్ చేసుకోవడం విశేషం. 

ఇటీవల `ది కాశ్మీర్‌ ఫైల్స్`, `కార్తికేయ 2` చిత్రాలతో వరుసగా సంచలన విజయాలు అందుకున్నారు నిర్మాత అభిషేక్‌ అగర్వాల్. రెండూ వంద కోట్లకుపైగా కలెక్షన్లని రాబట్టాయి. నిర్మాతకు ఊహించిన లాభాలను తీసుకొచ్చాయి. ఇంకా చెప్పాలంటే కలెక్షన్ల పంట పండించాయి. ఈ ఊపులో మరిన్ని భారీ బడ్జెట్‌ చిత్రాలను నిర్మించేందుకు ప్లాన్‌ చేస్తున్నారు అభిషేక్‌ అగర్వాల్‌. ఈ నేపథ్యంలో ఆయన ఓ గొప్ప కార్యానికి పూనుకున్నారు. ఓ ఊరిని దత్తత తీసుకున్నారు. 

నగర శివారు విలేజ్‌ అయిన తిమ్మాపూర్‌ గ్రామాన్ని దత్తత తీసుకున్నట్టు ప్రకటించారు. కోవిడ్‌ 19 మహమ్మారి సమయంలో చాలా వరకు తనవంతు సేవా కార్యక్రమాలు చేశారు అభిషేక్‌ అగర్వాల్‌. ఇప్పుడు విలేజ్‌ని దత్తత తీసుకోవడం విశేషం. రంగారెడ్డి జిల్లా, కందుకూరి మండలానికి చెందిన గ్రామమే తిమ్మాపూర్‌. యాదృశ్చికంగా ఇది కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి జన్మస్థలం కావడం విశేషం. అభిషేక్‌ అగర్వాల్‌, మంత్రి కిషన్‌ రెడ్డి మధ్య మంచి అనుబంధం ఉంది. వివిధ ఈవెంట్లు, ఫంక్షన్లలో వీరిద్దరు కలిసి కనిపిస్తుంటారు. 

అభిషేక్‌ అగర్వాల్‌, అతని కుటుంబం చంద్రకళా ఫౌండేషన్‌ స్థాపించి ప్రజలకు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తన తండ్రి తేజ్‌ నారాయన్‌ అగర్వాల్‌ 60వ పుట్టిన రోజు, దివంగత అమ్మమ్మ శ్రీమతి చంద్రకళా 90వ జయంతి సందర్భంగా తిమ్మాపూర్‌ గ్రామాన్ని దత్తత తీసుకోవడం విశేషం. మరోవైపు చంద్రకళ ఫౌండేషన్‌ 3వ సార్థక్‌ దివస్‌ అక్టోబర్‌ 30న మంత్రి కిషన్‌ రెడ్డి సమక్షంలో జరగనుంది. ఈ కార్యక్రమానికి హైదరాబాద్‌లోని జీఆర్సీ కన్వెన్షన్‌ వేదిక కానుంది. 

ఇదిలా ఉంటే దీనిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతుంటాయి. ఓ కేంద్ర మంత్రి, పలు మార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన సొంత గ్రామాన్ని మరొకరు దత్తత తీసుకోవాల్సిన అవసరం ఏముందని, మంత్రి స్థాయిలో ఉండి కూడా వేరొకరు దత్తత తీసుకోవాల్సిన పరిస్థితి నెలకొందా? అని ప్రశ్నిస్తున్నారు. అదే సమయంలో రెండు సినిమాలతో భారీ విజయాలు అందుకున్న నిర్మాతకి అభివృద్ధికి నోచుకోని గ్రామాలు కనిపించడం లేదా? ఆ గ్రామాన్నే ఎందుకు దత్తత తీసుకోవాల్సి వచ్చిందంటూ ప్రశ్నిస్తుండటం గమనార్హం. 
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 title Winner: నాగార్జున డైలాగ్‌తో చెప్పి మరీ కప్‌ కొట్టిన కళ్యాణ్‌, ఎమోషనల్‌ కామెంట్‌.. తనూజకే క్రెడిట్‌
Bigg Boss Telugu 9: రమ్య మోక్ష చేత అందరి ముందు క్షమాపణలు చెప్పించిన కళ్యాణ్‌.. పరువు పోయిందిగా