ఆటోగ్రాఫ్ అడిగితే.. సినిమా చేద్దామన్నారు!

Published : Dec 16, 2018, 03:41 PM IST
ఆటోగ్రాఫ్ అడిగితే.. సినిమా చేద్దామన్నారు!

సారాంశం

ఇండియన్ సూపర్ స్టార్ రాజినీకాంత్ తో సినిమా చేసే అవకాశం అందరికి రాదూ. ఎంత పెద్ద దర్శకుడైనా కూడా ఆయనతో జీవితంలో ఒక్క సినిమా అయినా చేయాలనీ అనుకుంటారు. తలైవా శాసించాలే గాని కథలు అప్పుడే పుడతాయి. ఆ విధంగా పేట్ట దర్శకుడు కార్తీక్ సుబ్బరాజుకు కూడా అనుకోకుండా అదృష్టం తలుపుతట్టింది. 

రజినీకాంత్ దగ్గరకు ఆటోగ్రాఫ్ కోసం వెళితే సినిమా అవకాశం దక్కిందట. ఈ విషయాన్నీ కార్తీక్ ఇటీవల తెలియజేశాడు. ఇప్పటికే నాలుగు సినిమాలకు దర్శకత్వం వహించి మంచి గుర్తింపు తెచ్చుకున్న కార్తీక్ జిగర్ తండా తో రజినీని ఎక్కువగా ఆకర్షించాడు. ఒకరోజు లింగా సినినా సెట్స్ లో ఉండగా రజినీకాంత్ ను కలుసుకున్నట్లు చెప్పాడు. 

అయితే తన సినిమాలో ఒక విలన్ రోల్ మీ పాత్రల స్ఫూర్తి నుంచి తీసుకున్నదే అని చెప్పగా రజినీకాంత్ గారు నన్నే తీసుకోవచ్చు కదా అని నవ్వుతు అన్నారు. ఇక ఫొటో తీసుకొని అక్కడి నుంచి వచ్చిన అనంతరం ఆటోగ్రాఫ్ తీసుకోవడం మర్చిపోయా. ఆ తరువాత ఆయనకు ఖాళీ సమయం దొరకదని ఆటోగ్రాఫ్ కోసం నా డైరీని పంపగా రజినీకాంత్ గారు కొంత గ్యాప్ దొరగ్గానే నన్ను పిలిచారు. 

మంచి స్క్రిప్ట్ ఉంటె చూడు కలిసి చేద్దాం అని చెప్పడంతో నేను ఉహించలేకపోయాను. వెంటనే పేట్ట కథ చెప్పగానే ఒప్పుకున్నారు కానీ కొన్ని కారణాల వల్ల సినిమా పట్టాలెక్కేందుకు ఆలస్యమయింది. కానీ ఫైనల్ గా ఇప్పుడు నా కల నెరవేరిందని కార్తీక్ సుబ్బరాజ్ వివరణ ఇచ్చాడు.  

PREV
click me!

Recommended Stories

Karthika Deepam 2 Today Episode: జ్యో, దీపల మధ్య మాటల యుద్ధం- దీప జోలికి వస్తే నరికేస్తానన్న పారు
Nayanthara Movies: 41 ఏళ్ల వయసులో ఇన్ని సినిమాలా? లేడీ సూపర్‌స్టార్ అసలు సీక్రెట్ ఏంటో తెలుసా?