Suriya and Karthi: కార్తీ దర్శకత్వంలో హీరో సూర్య.. అన్నయ్య రుణం తీర్చుకునే ప్రయత్నం ?

By team teluguFirst Published Aug 12, 2022, 10:15 AM IST
Highlights

హీరో సూర్య, కార్తీ అన్నదమ్ములుగా చిత్ర పరిశ్రమలో రాణిస్తున్నారు. సూర్య తెలుగు తమిళ భాషల్లో క్రేజీ స్టార్. కార్తీ కూడా అన్న బాటలో పయనిస్తూ తమిళంతో పాటు తెలుగులో కూడా మంచి గుర్తింపు పొందాడు.

హీరో సూర్య, కార్తీ అన్నదమ్ములుగా చిత్ర పరిశ్రమలో రాణిస్తున్నారు. సూర్య తెలుగు తమిళ భాషల్లో క్రేజీ స్టార్. కార్తీ కూడా అన్న బాటలో పయనిస్తూ తమిళంతో పాటు తెలుగులో కూడా మంచి గుర్తింపు పొందాడు. కార్తీ నటించిన తాజా చిత్రం 'వీరుమాన్' నేడు తమిళంలో గ్రాండ్ గా రిలీజ్ అవుతోంది. 

విశేషం ఏంటంటే.. ఈ చిత్రాన్ని కార్తీ సోదరుడు సూర్య నిర్మించారు. తన తమ్ముడి సినిమాని నిర్మించడం సూర్యకి ఇది రెండోసారి. మూడేళ్ళ క్రితం వచ్చిన చిన బాబు చిత్రాన్ని కూడా సూర్యనే నిర్మించారు. ఆ మూవీ బాక్సాఫీస్ వద్ద డీసెంట్ హిట్ గా నిలిచింది. ఇప్పుడు మరోసారి సూర్య కార్తీ నటించిన వీరుమాన్ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేశారు. 

ప్రచార కార్యక్రమాల్లో కార్తీ తన అన్నయ్యపై ఎమోషనల్ కామెంట్స్ చేశాడు. అన్నయ్య తనకు రాముడితో సమానం అని అన్నారు. లక్ష్మణుడిలా ఎప్పుడూ అన్నయ్య వెంటే ఉంటా. నా ముందు ఆయన ఉంటే ధైర్యంగా ఉంటుంది. అలాగే నా వెనుక తమ్ముడు ఉన్నాడని అయన కూడా ధీమాగా ఉంటారు. 

మణిరత్నం గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉన్నప్పుడు అన్నయ్య కోసం ఒక కథ రాసుకున్నా అని కార్తీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. సూర్యని డైరెక్ట్ చేసే విషయంలో కూడా కార్తీ హింట్ ఇచ్చాడు. నటుడిగా కార్తీ తానేంటో నిరూపించుకున్నాడు. అయినప్పటికీ సూర్య తన తమ్ముడికి ప్రతి చిత్రంలోనూ అండగా ఉంటాడు. ఇప్పటికే రెండు సినిమాలు నిర్మించాడు. దీనితో అన్నయ్యని డైరెక్ట్ చేసి అలా ఆయన రుణం తీర్చుకోవాలని కార్తీ ప్రయత్నిస్తున్నాడు. 

ఇదే కనుక జరిగితే సౌత్ లో అది మోస్ట్ క్రేజీ ప్రాజెక్ట్ అవుతుంది. సూర్య కోసం కార్తీ రాసుకున్న కథ బయోపిక్ అట. మరి ఆ బయోపిక్ ఎవరిదో తెలియాలంటే కొంతకాలం వేచి చూడక తప్పదు. ఇక ముత్తయ్య దర్శకత్వంలో వీరుమాన్ చిత్రం తెరకెక్కింది. దిగ్గజ దర్శకుడు శంకర్ కుమార్తె అదితి శంకర్ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించింది. 

click me!