ప్రభాస్ తో 41 ఏళ్ల హాట్ బ్యూటీ రొమాన్స్ .. నిజామా ?

pratap reddy   | Asianet News
Published : Oct 13, 2021, 06:02 PM IST
ప్రభాస్ తో 41 ఏళ్ల హాట్ బ్యూటీ రొమాన్స్ .. నిజామా ?

సారాంశం

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ క్రేజ్ ప్రస్తుతం ఆకాశాన్ని తాకుతోంది. ప్రభాస్ క్రేజ్ ముందు బాలీవుడ్ స్టార్ హీరోలు సైతం నిలువలేకపోతున్నారు అంటే అతిశయోక్తి కాదు.

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ క్రేజ్ ప్రస్తుతం ఆకాశాన్ని తాకుతోంది. ప్రభాస్ క్రేజ్ ముందు బాలీవుడ్ స్టార్ హీరోలు సైతం నిలువలేకపోతున్నారు అంటే అతిశయోక్తి కాదు. బాహుబలి చిత్రం ప్రభాస్ కు అంతలా గుర్తింపు తెచ్చిపెట్టింది. బాహుబలి తర్వాత ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు. 

ఇదిలా ఉండగా ప్రభాస్ వరుస చిత్రాలతో బిజీగా మారుతున్నాడు. ఇప్పటికే Radhe Shyam చిత్రం సంక్రాంతి రిలీజ్ కు రెడీ అవుతుండగా.. సలార్, ఆదిపురుష్ లాంటి చిత్రాలు సెట్స్ పై ఉన్నాయి. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రాజెక్ట్ కె కూడా ప్రారంభమైంది. ఇవి కాక రీసెంట్ గా మరో క్రేజీ ప్రాజెక్ట్ ని కూడా ప్రభాస్ ప్రకటించాడు. 

Also Read: ముండమోసినట్లు ఏడుస్తున్నారు.. అనసూయ ఓటమి, ప్రకాష్ రాజ్ ప్యానల్ వైఖరిపై నరేష్ హాట్ కామెంట్స్

అర్జున్ రెడ్డి ఫేమ్ Sandeep Reddy Vanga దర్శకత్వంలో 'స్పిరిట్' అనే చిత్రంలో ప్రభాస్ నటించబోతున్న సంగతి తెలిసిందే. ఇది కూడా భారీ స్థాయిలో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కనుంది. ఈ చిత్రంలో నటించే హీరోయిన్ విషయంలో ఆసక్తికర ప్రచారం మొదలైంది. 

బాహుబలి చిత్రం తర్వాత Prabhas తో రొమాన్స్ చేసేందుకు బాలీవుడ్ హీరోయిన్లు అంతా ఆసక్తి చూపుతున్నారు. ఆ లిస్ట్ లో కరీనా కపూర్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. స్పిరిట్ చిత్రం కోసం మేకర్స్ హీరోయిన్ గా కరీనాని సంప్రదిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై అధికారిక సమాచారం లేదు. 

కానీ ఇది జరిగితే ప్రభాస్, Kareena Kapoor కాంబినేషన్ వెండితెరపై క్రేజీగా మారడం ఖాయం. ప్రస్తుతం కరీనా వయసు 41 ఏళ్ళు.. ఆమె ఇద్దరు పిల్లలకు తల్లి కూడా. కానీ అందంలో, ఫిట్ నెస్ విషయంలో కరీనా కుర్ర హీరోయిన్లతో పోటీ పడుతోంది. కరీనా భర్త సైఫ్ ప్రస్తుతం ప్రభాస్ ఆదిపురుష్ చిత్రంలో రావణుడిగా నటిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే ప్రభాస్ నుంచి కరీనా బిర్యానీ ట్రీట్ కూడా అందుకుంది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: రీతూ కాదు, తనూజ వెంటపడేవాడిని.. షాకిచ్చిన డీమాన్‌ పవన్‌.. బిగ్‌ బాస్‌ ఎమోషనల్‌ జర్నీ
ఈ హీరోయిన్ నటించిన 4 సినిమాలు డిజాస్టర్లు.. కానీ పేరేమో మరో సావిత్రి