మూలాలు మర్చిపోకు.. ప్రియాంకకి కరీనా వార్నింగ్!

Published : Mar 07, 2019, 03:53 PM IST
మూలాలు మర్చిపోకు.. ప్రియాంకకి కరీనా వార్నింగ్!

సారాంశం

బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్లుగా వెలుగొందుతోన్న కరీనా కపూర్, ప్రియాంక చోప్రాలకు ప్రేక్షకుల్లో ఎంతటి ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 

బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్లుగా వెలుగొందుతోన్న కరీనా కపూర్, ప్రియాంక చోప్రాలకు ప్రేక్షకుల్లో ఎంతటి ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కరీనా పెళ్లైన తరువాత కూడా బాలీవుడ్ లో అవకాశాలు దక్కించుకుంటూ ఉంటే.. ప్రియాంక పెళ్లి చేసుకొని హాలివుడ్ లో బిజీ అయిపోయింది.

తాజాగా వీరిద్దరూ కలిసి కరణ్ జోహార్ నిర్వహించే 'కాఫీ విత్ కరణ్' కార్యక్రమానికి వచ్చారు. ఈ షోలో భాగంగా కరణ్.. ''వరుణ్ ధావన్ గర్ల్ ఫ్రెండ్ పేరు చెప్పండి..?'' అంటూ ప్రియాంక చోప్రాని అడిగారు. దానికి ఆమె తనకు తెలియదని చెప్పింది.

వెంటనే పక్కనే ఉన్న కరీనా కపూర్ ''అయితే నీకిప్పుడు కేవలం హాలివుడ్ యాక్టర్ల పేర్లు మాత్రమే తెలుస్తాయా..? నీ సమాధానం వింటే అలానే అనిపిస్తుంది. మూలాలను మర్చిపోవద్దు'' అంటూ నవ్వుతూ స్వీట్ వార్నింగ్ ఇచ్చేసింది.

ప్రస్తుతం ప్రియాంక 'ది స్కై ఈజ్ పింక్' అనే సినిమాలో నటిస్తోంది. ఇక కరీనా.. అక్షయ్ కుమార్ సరసన 'గుడ్ న్యూస్' సినిమాలో నటిస్తోంది. 

PREV
click me!

Recommended Stories

Karthika Deepam 2 Today Episode: కార్తీక్, దీపలకు బిగ్ షాక్- స్వప్న, కాశీ విడాకులు- దశరథ ఆవేదన
Illu Illalu Pillalu: భాగ్యం శాడిజం, సాగర్ ని చావబాదిన రామరాజు, నీకు పిల్లల్ని పెంచడం రాదన్న నర్మద తండ్రి