‘సీత’ పాత్ర చేస్తున్నందుకు మతిపోయే రెమ్యునేషన్

By Surya Prakash  |  First Published Jun 8, 2021, 11:31 AM IST

తాజాగా సీత దృక్కోణం నుంచి రామాయణ గాథని ఆవిష్కరించబోతున్నారు. ఈ మేరకు హిందీలో ఓ భారీ చిత్రాన్ని తెరకెక్కించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ‘సీత’ పేరుతో రూపొందనున్న ఈ చిత్రానికి ‘బాహుబలి’ రచయిత విజయేంద్రప్రసాద్‌ కథను అందిస్తున్నారు. 
 


ఒక హీరోయిన్ కు రెమ్యునేషన్ గా 12 కోట్లు ఇస్తారా ..నమ్మచ్చా అంటే నిజమే అంటోంది బాలీవుడ్ మీడియా. ఆ హీరోయిన్ మరెవరో కాదు కరీనాకపూర్. అదీ ఆమె సీత పాత్ర వేస్తున్నందుకు కాను అని చెప్తున్నారు. సీత పాత్రలో చాలా యాంగిల్స్ ఉన్నాయట. ఆమె వాటిని సమర్దవంతంగా పోషించగలదు అని చెప్తున్నారు.

వివరాల్లోకి వెళితే...ప్రస్తుతం బాలీవుడ్‌తో పాటు సౌత్ లోనూ పురాణాలు, ఇతిహాసాల్ని ఆధారంగా చేసుకొని సినిమాల్ని తెరకెక్కించే మొదలైంది. తాజాగా సీత దృక్కోణం నుంచి రామాయణ గాథని ఆవిష్కరించబోతున్నారు. ఈ మేరకు హిందీలో ఓ భారీ చిత్రాన్ని తెరకెక్కించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ‘సీత’ పేరుతో రూపొందనున్న ఈ చిత్రానికి ‘బాహుబలి’ రచయిత విజయేంద్రప్రసాద్‌ కథను అందిస్తున్నారు. 

Latest Videos

రామాయణాన్ని కొత్త కోణంలో చర్చిస్త్తూ రూపుదిద్దుకోనున్న ఈ సినిమాలో సీత పాత్రను కరీనాకపూర్‌ పోషించనున్నట్లు వార్తలొస్తున్నాయి. ఆమెకు ఆ పాత్ర చేసినందుకు కాను 12 కోట్లు ఇవ్వబోతున్నారట. సాధారణంగా కరీనాకపూర్ సినిమాకు ఆరు కోట్లు దాకా తీసుకుంటుంది. ఈ సినిమాతో ఆమె పాత్ర కోసం చాలా హోం వర్క్ చేయాల్సి ఉంటుందిట. అందుకే ఈ స్దాయి రెమ్యునేషన్ అంటున్నారు.

రెమ్యునేషన్ తో పాటు కథ,అందులో తన పాత్రను తీర్చిదిద్దిన విధానం నచ్చడంతో ఆమె ఈ సినిమాను అంగీకరించిందని చెబుతున్నారు. రావణుడిగా బాలీవుడ్‌ స్టార్ హీరో రణ్‌వీర్‌సింగ్‌ నటించబోతున్నారు. రణ్‌వీర్‌సింగ్‌, కరీనాకపూర్‌ కలయికలో రానున్న తొలి చిత్రమిదే కావడం గమనార్హం. అలౌకిక దేశాయ్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. బిడ్డ‌కు జ‌న్మనిచ్చిన క‌రీనా ఇంకొన్నాళ్లు రెస్ట్ తీసుకుని ఆ త‌ర్వాత ఈ కేర‌క్ట‌ర్ కోసం ప్రిపేర్ అవ్వనుంది. 

click me!