
బాలీవుడ్ లో ఫ్యామిలీ లైఫ్ ను హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్న కపుల్స్ లో కరీనా కపూర్- సైఫ్ అలీ ఖాన్ జంట కూడా ముందుంటారు. సైఫ్ కు రెండో పెళ్లి అయినా...కరీనాను ఘాటుగా ప్రేమించి.. హ్యాపీగా చూసుకుంటున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు కాగా. ఫ్యామిలీతో కలిసి హ్యాపీగా ఉన్నారు బాలీవుడ్ కపుల్.
ఈక్రమంలో ఈ ఇద్దరు.. వారికి ఇద్దరు కలిసి ఎప్పటికప్పుడు టూర్లు వేళ్తూ.. సందడి చేస్తుంటారు. నచ్చి ప్రదేశాలు చూడటం.. హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంటారు. ఈక్రమంలో ఈ జంట కాస్త ముందుగానే క్రిస్మస్ సందడి స్టార్ట్ చేశారు. అయితే ముంబయ్ లో కాకుండా వెకేషన్ కోసం ఇతర ప్రాంతాలకువెళ్ళి.. హ్యాపీగా పండుగను జరుపుకుంటున్నారు. అంతే కాదు ఫెస్టివల్ అని కాకుండా.. ఓ రొమాంటిక్ టూర్ ను ఇద్దరు వేసినట్టు తెలుస్తోంది.
చండీఘఢ్ లోని పటౌడీ ప్యాలెస్‌లో క్రిస్‌మస్ హాలిడేస్‌ను భర్త సైఫ్ అలీఖాన్‌తో కలిసి ఎంజాయ్ చేస్తున్న కరీనా కపూర్ ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. భర్తతో కలిసి హాలిడేస్‌ను ఆస్వాదిస్తున్న కరీనాకపూర్.. విమర్షకులకు కూడా సరిగ్గా సమాధానం చెపుతున్నారు.
భర్తతో వెకేషన్‌ను ఎంజాయ్ చేయడంతో పాటు నోరూరించే వంటకాలను ఆస్వాదించే ఫొటోలను కరీనా కపూర్ ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేసింది. ఈ ఫొటోల్లో బాలీవుడ్ హాట్ కపుల్ విశాలవంతమైన లాన్‌లో విహరించడం ఫోటోలలో కనిపిస్తుంది.