కేసులు పెట్టి కోర్టుకు లాగనున్న కరణ్ జోహార్

By Surya PrakashFirst Published Jul 23, 2020, 9:14 AM IST
Highlights

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మ‌హ‌త్యపై గ‌త కొన్ని రోజులుగా బాలీవుడ్‌లో తీవ్రస్థాయిలో వివాదాలు నెల‌కొంటున్న సంగతి తెలిసిందే. సినీ పరిశ్రమలోని నెపోటిజం కార‌ణంగానే సుశాంత్ ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడ‌ని బాలీవుడ్‌ క్వీన్‌ కంగ‌నా ర‌నౌత్ చేసిన వ్యాఖ్య‌ల అనంత‌రం ఈ వివాదం మరింత ముదిరింది. అంతేకాదు కరణ్ జోహార్, సల్మాన్, ఏక్తా కపూర్, అలియాభట్, సోనాక్షి సిన్హా లపై ట్రోలింగ్ విపరీతంగా పెరిగింది.

బాలీవుడ్‌ యంగ్‌ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మ‌హ‌త్యపై గ‌త కొన్ని రోజులుగా బాలీవుడ్‌లో తీవ్రస్థాయిలో వివాదాలు నెల‌కొంటున్న సంగతి తెలిసిందే. సినీ పరిశ్రమలోని నెపోటిజం కార‌ణంగానే సుశాంత్ ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడ‌ని బాలీవుడ్‌ క్వీన్‌ కంగ‌నా ర‌నౌత్ చేసిన వ్యాఖ్య‌ల అనంత‌రం ఈ వివాదం మరింత ముదిరింది. అంతేకాదు కరణ్ జోహార్, సల్మాన్, ఏక్తా కపూర్, అలియాభట్, సోనాక్షి సిన్హా లపై ట్రోలింగ్ విపరీతంగా పెరిగింది. అక్కడితో ఆగకుండా కరణ్‌ జోహర్‌, సల్మాన్‌ ఖాన్‌, ఏక్తాకపూర్‌లపై బిహార్‌ ముజఫర్‌ కోర్టులో  ఇప్పటికే కేసు నమోదైంది. ఈ ట్రోలింగ్,కేసులు నేపధ్యంలో కరణ్ జోహార్ ఓ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. లీగల్ గా ముందుకు వెళ్ళాలని, అందుకోసం ఓ టీమ్ ని అపాయింట్ చేస్తున్నట్లు బాలీవుడ్ మీడియా సమాచారం.

కరణ్ ఇప్పటికే లీగల్ గా యాక్షన్ తీసుకోవటానికి కావల్సిన సాక్ష్యాధారాలు సేకరించారు. కొంతమంది లాయిర్స్ గల టీమ్ తో ఆయన చర్చలు జరుపుతున్నారు. అలాగే ఆన్ లైన్ టెక్కీ ఎక్సపర్ట్ లను సైతం ఆయన సంప్రదిస్తున్నారు. హింస ప్రేరేపిస్తూ, బెదిరిస్తూ వాఖ్యలు చేసిన వారిపై లీగల్ చర్యలు ఉండనున్నాయి. టెక్నికల్ టీమ్ ఇప్పటికే సోషల్ మీడియాలో దారుణమైన ట్రోలింగ్ చేస్తూ కామెంట్స్ చేసిన వారిని వెతికిపట్టుకునే పనిలో ఉన్నారు. ఫేక్ ఎక్కౌంట్ లను క్రియేట్ చేసిన వారిని సైతం తవ్వుతున్నారు.
 
కేసు కనుక ప్రూవ్ అయితే లక్షల్లో పెనాల్టీలు, కొందరికి జైలు శిక్ష తప్పవని చెప్తున్నారు. సెక్షన్ 67 ఐటీ యాక్ట్ సెక్షన్  507 IPC ఈ కేసులు పెట్టబోతున్నారు. ఇక సుశాంత్ మరణం తర్వాత కరణ్ జోహార్ సోషల్ మీడియాలో లేవు. ఆయన చివరి పోస్ట్..సుశాంత్ ఇచ్చిన నివాళి. 

click me!