నోరా ఫతేహి ప్రేమలో షారుక్ కొడుకు ఆర్యన్ ఖాన్ ?

By Sambi ReddyFirst Published Jan 5, 2023, 6:41 PM IST
Highlights

బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ నటి నోరా ఫతేహితో డేటింగ్ చేస్తున్నాడంటూ బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. అందుకు బయటకు వచ్చిన ఫొటోలే నిదర్శనం అంటున్నారు. 
 

బాలీవుడ్ స్టార్స్ లగ్జరీ లైఫ్ అనుభవిస్తారు. వారి కిడ్స్ కూడా ఈ విషయంలో తక్కువేమీ కాదు. విందులు, విహారాలు, పార్టీలు, డేటింగ్లు అంటూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇక హీరోగా అరంగేట్రం చేయకుండానే షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ ఎఫైర్స్ నడుపుతున్నారంటూ బాలీవుడ్ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. నటి నోరా ఫతేహితో అతడు డేటింగ్ చేస్తున్నాడట. నోరా ఫతేహి, ఆర్యన్ ఖాన్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం దుబాయ్ వెళ్లారట. 

ఇటీవల ఆర్యన్-నోరా ఫతేహి ఓ డిన్నర్ పార్టీలో సందడి చేశారు. వీరిద్దరూ కలిసి ఉన్న కొన్ని ఫోటోలు బయటకు వచ్చాయి. మొత్తంగా ఆర్యన్ ఖాన్, నోరా ఫతేహి మధ్య రహస్య ప్రేమాయణం నడుస్తుందన్న వాదన మొదలైంది. ఇక ఆర్యన్ వయసు 25 ఏళ్లు కాగా, నోరా ఫతేహి వయసు 30. ఐదేళ్ల గ్యాప్ పెద్ద విషయమేమీ కాదు. అలాగే బాలీవుడ్ లో ఇలాంటి భిన్నమైన ప్రేమ జంటలు కామనే. అర్జున్ కపూర్ 50 ఏళ్ల మలైకా అరోరాతో ఎఫైర్ నడుపుతున్నాడు. 

ఆర్యన్ ఖాన్ గత ఏడాది అతిపెద్ద వివాదంలో ఇరుక్కున్నాడు. రేవ్ పార్టీలో పాల్గొన్న ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ ఆరోపణలపై అరెస్ట్ కాబడ్డారు. 2021 అక్టోబర్ 3న నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అధికారులు ఆర్యన్ ఖాన్ ని అదుపులోకి తీసుకున్నారు. ఆర్యన్ ఖాన్ ని బయటకు తెచ్చేందుకు షారుక్ ఖాన్ విశ్వ ప్రయత్నం చేశాడు. ఆ సమయంలో షారుక్ మానసిక వేదన అనుభవించాడు. సినిమా షూటింగ్స్ కూడా పక్కన పెట్టి కొడుక్కి బెయిల్ తెచ్చేందుకు దేశంలోనే గొప్ప లాయర్స్ చుట్టూ తిరిగాడు. దాదాపు నెల రోజుల తర్వాత అక్టోబర్ 28న బాంబే హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. 

ఇక నోరా ఫతేహి విషయానికి వస్తే... ఆమె తెలుగులో బాహుబలి 1 మూవీలో ఐటెం సాంగ్ చేశారు. అలాగే మరో రెండు తెలుగు చిత్రాల్లో ఐటెం సాంగ్స్ చేశారు. పవన్ కళ్యాణ్ క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హరి హర వీరమల్లు మూవీలో నోరా ఫతేహి ఒక హీరోయిన్ గా నటిస్తున్నారు. 
 

click me!