తెలుగు స్టేట్ లో ‘కాంతార’ సక్సెస్ టూర్.. రూట్ మ్యాప్ ఇదే!

Published : Oct 28, 2022, 11:11 AM IST
తెలుగు స్టేట్ లో ‘కాంతార’ సక్సెస్ టూర్.. రూట్ మ్యాప్ ఇదే!

సారాంశం

హీరో రిషబ్ శెట్టి నటించిన కన్నడ చిత్రం ‘కాంతార’ భారీ విజయాన్ని అందుకుంది. తెలుగు ప్రేక్షకులు కూడా బ్రహ్మరథం పట్టడంతో చిత్రయూనిట్ ఏపీలో సక్సెస్ టూర్ కు డేట్ ఫిక్స్ చేసింది. రూట్ మ్యాప్ నూ ప్రకటించింది.  

కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి (Rishab Shetty) ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘కాంతార’(Kantara). రచన, దర్శకత్వం కూడా రిషబ్ శెట్టినే వహించారు. చిత్రం కన్నడతో పాటు తెలుగు, హిందీలోనూ ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నదో తెలిసిందే. భారీ విజయాన్ని సొంతం చేసుకున్న ఈ చిత్రాన్ని  ‘కేజీఎఫ్’ నిర్మాణ సంస్థ హోంబాలే ఫిల్మ్స్ బ్యానర్ పై నిర్మించారు. గత నెల 31న కన్నడలో విడుదలైంది. తెలుగులో గీతా ఆర్ట్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ (Allu Aravind) అక్టోబర్ 15న విడుదల చేశారు. 

తెలుగు ప్రేక్షకులకు కూడా ఈ చిత్రం బాగా నచ్చడంతో చిత్ర యూనిట్ సంతోషం వ్యక్తం చేస్తోంది. మరోవైపు బాక్సీఫీస్ వద్ద కూడా కాంతార కలెక్షన్ల మోత మోగిస్తోంది. ఇంతటి విజయాన్ని అందించడంతో అభిమానులు, ప్రేక్షకులకు స్పెషల్ గా థ్యాంక్స్ చెప్పేందుకు ‘కాంతార సక్సెస్ టూర్’ను ప్లాన్ చేశారు. ఈ టూర్ రేపే (అక్టోబర్ 29)  తెలుగు స్టేట్స్ లోని ఏపీలో నిర్వహించనున్నారు.

 మొదట తిరుపతిలోని జయశ్యామ్ థియేటర్ కి ఉదయం 10 :15కు చేరుకోనున్నారు. అక్కడి నుంచే టూర్ ప్రారంభం కానుంది. అక్కడ అభిమానులకు ధన్యవాదాలు తెలిపి, వారితో సినిమా చూడనున్నారు.  మధ్యాహ్నం 1: 15 కు విజయవాడలోని రాజ్ యువ రాజ్ థియేటర్ కి, సాయంత్రం 5 :15కు లకు విశాఖపట్నంలోని జగదాంబ థియేటర్ కి వెళ్లి సందడి చేయనున్నారు. దీంతో కాంతారకు మరింత క్రేజ్ పెరిగే అవకాశం ఉంది.  

మరోవైపు చిత్రాన్ని ఆడియెన్స్ తో ఓటీటీలోనూ వీక్షించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ క్రమంలో ఓటీటీ రిలీజ్ డేట్ పైనా ప్రకటన చేశారు. నవంబర్ 4న ఓటీటీలోకి వస్తుందనే రూమర్ ను కొట్టిపారేశారు.  ‘కాంతార’కు ఉన్న క్రేజ్ కారణంగా మరింత ఆలస్యంగానే ఓటీటీలోకి వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇక ఇప్పటికీ కాంతార థియేట్రికల్ రన్ ను కొనసాగిస్తోంది.  ఇప్పటికే రూ.150 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. హిందీలో రూ.20 కోట్లకు పైగా వసూళ్లు చేసింది. ఇక తెలుగు స్టేట్స్ లో రూ.30 కోట్లకు పైగా కలెక్షన్స్ చేసి అదరహో అనిపించింది.

 

PREV
click me!

Recommended Stories

సంక్రాంతి సినిమాల రేసులో ట్విస్ట్, ఆడియన్స్ కు సర్ ప్రైజ్ గిఫ్ట్ ఏంటో తెలుసా?
Gunde Ninda Gudi Gantalu Today:తల్లికి ఎదురు తిరిగిన మనోజ్.. షాక్ లో ప్రభావతి, మనోజ్ చెంపలు వాయించిన బామ్మ