నవీన్ చంద్ర...కంపల్సివ్ సెక్సవల్ డిజార్డర్, అదీ మ్యాటర్

Published : Oct 28, 2022, 07:44 AM IST
 నవీన్ చంద్ర...కంపల్సివ్ సెక్సవల్ డిజార్డర్, అదీ మ్యాటర్

సారాంశం

అందాల రాక్షసి' సినిమాతో నవీన్ చంద్రకు మంచి గుర్తింపు వచ్చింది. ఒక పక్క సపోర్టింగ్ రోల్స్, విలన్ వేషాలు చేస్తూనే మరోపక్క హీరోగా కూడా నటిస్తూ, తనలోని విలక్షణ నటనను ప్రేక్షకుల ముందు ప్రదర్శిస్తున్నారు 


నవీన్ చంద్రకు అనుకున్న స్దాయిలో గుర్తింపు రాలేదు. హీరోగా చేస్తూనే ఓవైపు స‌పోర్టింగ్ రోల్స్‌, విల‌న్ పాత్ర‌లు చేస్తున్నాడు. తనను తాను బిజీ చేసుకుంటూ బ్రేక్ కోసం ఎదురుచూస్తున్నాడు న‌వీన్ చంద్ర‌.  ఆక్రమంలో  న‌వీన్ చంద్ర హీరోగా న‌టిస్తున్న తాజా చిత్రం త‌గ్గేదేలే. దివ్య పిళ్లై హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఈ చిత్రానికి దండుపాళ్యం ఫేమ్ శ్రీ‌నివాస‌రాజు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ సినిమా నవంబర్ 4న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్ లలో విడుదల కానుంది. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ తాజాగా విడుదలైంది. ఈ ట్రైలర్ ఇంట్రస్టింగ్ గా ఉంది. ఇందులో హీరోకు కంపల్సివ్ సెక్సవల్ డిజార్డర్ ఉన్నట్లు అర్దమవుతోంది. ఈ ట్రైలర్ పై మీరూ ఓ లుక్కేయండి.
 
ఇక ఈ ట్రైల‌ర్‌లో చూసిన‌ట్ట‌యితే పేషెంట్ బాడీలో ఉన్న బుల్లెట్‌ని తీస్తుండ‌గా ప్రారంభం అవుతుంది.  పోలీసుల‌కు హీరో న‌వీన్ చంద్ర ఫోన్ చేస్తాడు. “ఆ అమ్మాయి ఎవ‌రు.? నువ్వు ఎవ‌రు..? నీకు ఆ అమ్మాయికి ఉన్న సంబంధం ఏంటి” అని పోలీసులు విచారిస్తుంటారు. ఈ ట్రైలర్ తో ఈ సినిమా ప్రేమ‌, స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ నేపథ్యంలో ఉంటుందని తెలుస్తోంది. “నిన్ను చూస్తుంటే న‌క్స‌లైట్‌గా కూడా లేవు. కొంప‌తీసి సీరియ‌ల్ కిల్ల‌ర్ వా ఏంటి” అనే డైలాగ్ ఆక‌ట్టుకుంటుంది.

నవీన్ చంద్ర‌ను పోలీసులు ఓ ర‌హ‌స్య ప్రాంతానికి తీసుకెళ్లడంతో.. “న‌న్ను ఇక్క‌డికి ఎందుకు తీసుకొచ్చారు. ఎన్‌కౌంట‌ర్ చేస్తారా”  అనే డైలాగ్ స‌స్పెన్స్‌ ను క్రియేట్ చేస్తుంది. అందులో విల‌న్ చాలా మందిని కాల్చి చంప‌డం సినిమాపై ఆసక్తిని పెంచుతుంది. ఈ చిత్రంలో  దండుపాళ్యం లో కనిపించిన డేంజరేస్ పూజాగాంధీ బ్యాచ్ కూడా ఈ సినిమాలో కనిపిస్తుంది. ఇందులో పూజా గాంధీ
చేసే ఫైట్ ఆక‌ట్టుకుంటుంది. మొత్తంగా ఈ ట్రైలర్ తో.. సినిమా సస్పెన్స్ థ్రిల్లర్ గా సాగుతుందని అర్థమవుతుంది. దండుపాళ్యం గ్యాంగ్ సినిమాకు హైలైట్ అవుతోందనిపిస్తోంది.
   
ఈ సినిమాకు 'దండుపాళ్యం' ఫేమ్ శ్రీనివాసరాజు దర్శకత్వం వహిస్తున్నారు. హీరోయిన్ గా దివ్య పిళ్ళై కనిపించనున్నారు. అనన్య సేన్ గుప్తా, రవి శంకర్, రాజా రవీందర్, నాగ బాబు, అయ్యప్ప శర్మ, పృథ్వీ తదితరులు తెరపై కనిపించనున్నారు. ఇక భద్ర ప్రొడక్షన్స్ పతాకంపై మొదటి చిత్రంగా 'తగ్గేదేలే' సినిమా ను నిర్మిస్తున్నారు. ఈ సినిమా నవంబర్ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది.
 

PREV
click me!

Recommended Stories

సంక్రాంతి సినిమాల రేసులో ట్విస్ట్, ఆడియన్స్ కు సర్ ప్రైజ్ గిఫ్ట్ ఏంటో తెలుసా?
Gunde Ninda Gudi Gantalu Today:తల్లికి ఎదురు తిరిగిన మనోజ్.. షాక్ లో ప్రభావతి, మనోజ్ చెంపలు వాయించిన బామ్మ