
కన్నడ మూవీ కాంతార.. కార్తికేయా-2 సినిమా రికార్డ్స్ నుపక్కకు జరిపేసింది. అతి తక్కువ మెజారిటీతో నిఖిల్ సినిమాను క్రాస్ చేసుకుంటూ వెళ్ళింది. కార్తికేయా 2 కంటే కాంతారా ఎంత ఎక్కువ కలెక్షన్స్ ను సాధించింది...?
కన్నడ నాట నుంచి వచ్చిన సినిమాలు పాన్ ఇండియాను ఆకట్టుకుంటున్నాయి. అలా వచ్చిన సినిమానే కాంతార. ఈ మూవీపై ఆడియన్స్ తో పాటు సెలబ్రిటీల్ కూడా మెస్మరైజ్ అవుతున్నారు. కాంతార సినిమాపై సోషల్ మీడియాలో రకరకాలుగా స్పందిస్తున్నారు. ఈమూవీ ఓవర్ ఆల్ గా ఇండియన్ ఆడియన్స్ ను బాగా ఆకట్టుకుంది. ఈ ఏడాది బ్లాక్ బస్టర్ సినిమాలలో ఒకటిగా నిలిచింది. ఇక ఇప్పుడు ఈ మూవీ రికార్డ్ ల వేటలో పడింది.
ఈ ఏడాది బ్లాక్‌బస్టర్ సినిమాలలో ఒకటిగా నిలిచిన నిఖిల్ కార్తికేయ-2 రికార్డును కాంతారబ్రేక్ చేసింది. కార్తికేయ-2 మూవీ హిందీ వెర్షన్ ను క్రాస్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. హిందీలో కార్తికేయా2 సినిమా 31.05 కోట్లు కలెక్ట్ చేయగా.. రీసెంట్ గా రిలీజ్ అయిన కాంతార మూవీ 31.70 కోట్లు వసూలు చేసింది. అలా చాలా తక్కువ తేడాతో కార్తికేయ-2 రికార్డును బ్రేక్ చేసింది. ఇదే జోష్ కంటిన్యూ చేస్తే కాంతార మరిన్ని రికార్డులను క్రియేట్ చేస్తుందని సినీ జనాలు భావిస్తున్నారు. ఇక తెలుగులో ఈ మూవీ 17 కోట్ల షేర్‌ను సాధించింది. తెలుగులో కాంతార చిత్రానికి మూడో వారం థియేటర్ కౌంట్ విపరీతంగా పెరిగింది. రెండో వారానికి దాదాపు రెండింతలు థియేటర్‌ల సంఖ్య పెరిగింది.
కేజీఎఫ్ తర్వాత కన్నడ నుంచి వచ్చిన సినిమాలు బాగా ఆకట్టుకుంటున్నాయి. పాన్ ఇండియా రేంజ్ లో సినిమాలు సత్తా చాటుతున్నాయి. ఈ క్రమంలోనే కన్నడ నాట నుంచి రీసెంట్ గా రిలీజ్ అయిన సినిమా కాంతార. ఈమూవీ కన్నడ ఇండస్ట్రీ నుంచి విడుదలై టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలుస్తుంది. యాక్షన్ మిస్టరీ థ్రిల్లర్ బ్యాగ్రౌండ్ తో తెరకెక్కిన కాంతార సినిమాను కేజీఎఫ్ ను నిర్మించిన హోంబలే ఫిలింస్ బ్యానర్‌లో విజయ్ కిరగందూర్ తెరకెక్కించారు.
బాలీవుడ్. టాలీవుడ్, రెలీవుడ్ నుంచి ఈమూవీకి భారీగా రెస్పాన్స్ వస్తోంది. రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో లీడ్ రోల్ పోషించిన ఈ మూవీ సెప్టెంబర్ 30న కన్నడలో రిలీజ్ అయ్యి భారీ రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఇక ఈమూవీ తెలుగు వెర్షన్‌ను గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింత్ రిలీజ్ చేశారు. సైలెంట్ గా వచ్చిన ఈసినిమా భారీ రెస్పాన్స్ తో ముందు వెళ్తోంది. రోజు రోజుకు సినిమాకు రెస్పాన్స్ పెరుగుతోంది.