కన్నప్ప స్టార్‌ అక్షయ్‌ కుమార్‌ పార్టీలకు ఎందుకు వెళ్లడో తెలుసా? తాగితే ఇక అంతే, క్రేజీ స్టోరీ

Published : Sep 21, 2025, 07:17 PM IST
Akshay Kumar

సారాంశం

కన్నప్ప స్టార్‌ అక్షయ్‌ కుమార్‌ పార్టీలకు, ఫంక్షన్లకు దూరంగా ఉంటారు. ఆయన ఎందుకు దూరంగా ఉంటారో వెల్లడించారు. ఆ కథేంటో చూద్దాం.  

`జాలీ ఎల్‌ఎల్‌బీ 3`తో సందడి చేస్తున్న అక్షయ్‌ కుమార్‌

`కన్నప్ప` చిత్రంతో తెలుగు ఆడియెన్స్ ని అలరించారు అక్షయ్‌ కుమార్‌. ప్రస్తుతం ఆయన `జాలీ ఎల్‌ ఎల్‌ బీ 3` చిత్రంతో బాక్సాఫీసు వద్ద సందడి చేస్తున్నారు. ఈ క్రమంలో అక్షయ్ కుమార్ ఇటీవల రజత్ శర్మ షో 'ఆప్ కీ అదాలత్'కు వచ్చారు. అక్కడ తన సినిమాలు, కెరీర్, భార్య, తన గురించి ఎన్నో ఆసక్తికర విషయాలను, సంఘటనలు పంచుకున్నారు. సాధారణంగా బాలీవుడ్ పార్టీలు, ఫంక్షన్లలో సెలబ్రిటీలు ఎక్కువగా పాల్గొంటారు. కానీ అక్షయ్‌కు ఇవన్నీ నచ్చవు. ఆయన త్వరగా నిద్రపోయి, ఉదయాన్నే త్వరగా లేవడానికి ఇష్టపడతారని అందరికీ తెలిసిందే. అక్షయ్ ఈ రొటీన్‌ను చాలా ఏళ్లుగా పాటిస్తున్నారు. అక్షయ్‌ ఎందుకు ఈ రూల్‌ ఫాలో అవుతున్నారో తెలుసుకుందాం. 

అక్షయ్ కుమార్ పార్టీలకు ఎందుకు వెళ్లరు?

షోలో రజత్ శర్మ 'మీరు పార్టీలకు ఎందుకు వెళ్లరు?' అని అక్షయ్ కుమార్‌ను అడిగారు. దానికి ఆయన 'నాకు త్వరగా నిద్రపోయే అలవాటు ఉంది, పార్టీలు రాత్రి ఆలస్యంగా జరుగుతాయి. అందుకే నేను వెళ్లను, కానీ వెళ్లడం ఇష్టం లేదని కాదు' అని సమాధానమిచ్చారు. రజత్ శర్మ డ్రింక్స్ గురించి రెండో ప్రశ్న అడిగారు, 'మీరు డ్రింక్స్ చేయరు, ఒక గ్లాస్ వైన్ తాగితే కంట్రోల్ కోల్పోతారని విన్నాను' అన్నారు. దానికి ఆయన చాలా సరదాగా సమాధానం ఇచ్చారు.   'ఒకసారి నేను కొంచెం వైన్ తాగాను, అప్పుడు నా అసలు స్వరూపంలోకి వచ్చి వంటగదిలోకి వెళ్లి వంట చేయడం మొదలుపెట్టాను. అందుకే నేను దానికి దూరంగా ఉంటాను' అని అక్షయ్‌ చెప్పారు. అక్షయ్ మాటలు విని షోలో ఉన్న ప్రేక్షకులు పగలబడి నవ్వారు. సినిమా షూటింగ్ కోసం బయటకు వెళ్లినప్పుడు తన వంటగదిని, చెఫ్‌ను వెంట తీసుకెళ్తానని కూడా అక్షయ్ ఈ షోలో చెప్పారు. ఆయనకు బయటి ఫుడ్ నచ్చదట.  

ఓటీటీలో ట్రెండ్ అవుతున్న జాలీ ఎల్ఎల్‌బీ

అక్షయ్ కుమార్ నటించిన 'జాలీ ఎల్ఎల్‌బీ 3'  సినిమా ఇటీవల విడుదలైంది. అదే సమయంలో, ఈ సిరీస్‌లోని గత రెండు సినిమాలు ప్రస్తుతం ఓటీటీలో ట్రెండ్ అవుతున్నాయి. 2013లో వచ్చిన అర్షద్ వార్సీ సినిమా 'జాలీ ఎల్ఎల్‌బీ'ని జియో హాట్‌స్టార్‌లో చూడొచ్చు. అలాగే, 2017లో వచ్చిన అక్షయ్ కుమార్ 'జాలీ ఎల్ఎల్‌బీ 2'ని కూడా జియో హాట్‌స్టార్‌లో చూడొచ్చు. ఈ రెండు సినిమాలు ప్రస్తుతం జియో హాట్‌స్టార్ చార్ట్‌లో టాప్ 10లో ట్రెండ్ అవుతున్నాయి. ఈ శుక్రవారం(సెప్టెంబర్‌ 19) విడుదలైన ఈ మూవీ రెండో రోజుల్లో రూ.44కోట్లు రాబట్టింది. మూడో రోజు భారీగా వసూళ్లు పెరిగే అవకాశం ఉంది. 

 

 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Kartik Aaryan: చెల్లి పెళ్లి వేడుకలో హంగామా చేసిన యంగ్ హీరో, సందడి మొత్తం అతడిదే.. వైరల్ ఫోటోస్
Radha Daughter: చిరంజీవి హీరోయిన్ కూతురు, గుర్తుపట్టలేనంతగా ఎలా మారిపోయిందో చూడండి