కన్నప్పలో కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్, మంచు వారి డ్రీమ్ ప్రాజెక్ట్ లో మరో సెలబ్రిటీ..

Published : Oct 13, 2023, 07:59 AM IST
కన్నప్పలో కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్, మంచు వారి డ్రీమ్ ప్రాజెక్ట్ లో మరో సెలబ్రిటీ..

సారాంశం

కన్నప్ప రేంజ్ ను అంతకంతకు పెంచేస్తున్నాడు మంచువారి హీరో. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోన్న ఈసినిమాలో.. ఇప్పటికే ఎంతో మంది స్టార్స్ ను అనౌన్స్ చేయగా.. తాజాగా మరో స్టార్ హీరో ఈసినిమాలో భాగం కాబోతున్నట్టు తెలుస్తోంది.   

  మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్  కన్నప్ప పై అంచనాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. భారీ బడ్జెట్ తో.. భారీ స్థాయిలో  ఈసినిమాను చేస్తున్నారు. ఈసినిమా స్థాయి  రోజురోజుకూ  పెంచుకుంటూపోతోంది. ఇప్పటికే అన్ని భాషల నుంచి వరుసగా స్టార్స్ కన్నప్పలో భాగస్వామ్యులు అవుతున్నారు. వరుస అప్ డేట్లతో పాన్ ఇండియా వైడ్‌గా ఈ సినిమా  ట్రెండ్ అవుతోంది.  ఒక్కొక్కరుగా స్టార్స్ జాయిన్ అవుతుండటంతో.. కన్నప్ప సినిమాపై  ఇప్పుడు దేశవ్యాప్తంగా దృష్టి పడింది. రెబల్ స్టార్ ప్రభాస్, మలయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్ కన్నప్ప సినిమాలో నటించబోతున్నారు. ఇప్పుడు వీరితో పాటు మరో స్టార్ వచ్చి చేరారు. 

తాజాగా కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్‌కుమార్ కన్నప్ప లో నటించబోతున్నారనేవార్త ప్రస్తుతం వైరల్ అవుతోంది.  మరో ముఖ్య పాత్రలో శివ రాజ్‌కుమార్ కనిపించబోతోన్నారని వార్తలు వైరల్ అవుతున్నాయి. శివ రాజ్‌కుమార్ పాత్రకు సంబంధించిన అప్ డేట్‌ను త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నట్టుగా తెలుస్తోంది. 

ఈసినిమాను పాన్ ఇండియా లెవల్లో రూపొందించనుండటంతో.. ప్రతీ భాష నుంచి ఒక్కొక్క స్టార్ ను తీసుకుంటున్నారు. ఇలా ప్రతీ ఇండస్ట్రీలోని సూపర్ స్టార్స్  కన్నప్ప'లో భాగస్వామి అవుతుండటంతో అందరి ఫోకస్ ఈ మూవీపైనే పడింది. అయితే కన్నప్పలో శివరాజ్ కుమార్ కు సబంధించి మంచు విష్ణు పోస్ట్ కూడా ఇఫ్పుడు వైరల్ అవుతోంది. 

ఇక ఈసినిమా ను బుల్లితెరపై 'మహాభారతం' సీరియల్‌ను తీసిన ముఖేష్ కుమార్ సింగ్  తెరకెక్కిస్తున్నారు. శివ భక్తుడైన కన్నప్ప కథను ఆధారంగా తీసుకుని చేస్తున్న ఈ మూవీలో 'కన్నప్ప'గా మంచు విష్ణు కనిపించబోతోన్నారు. అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీకి పరుచూరి గోపాలకృష్ణ, బుర్రా సాయి మాధవ్, తోట ప్రసాద్ వంటి రచయితలు పనిచేశారు. ఈమధ్యనే ఫారెన్ షూట్ కోసం.. దాదాపు 8 కంటైనర్లను ప్లైట్ లో తరలించారు టీమ్. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

తనూజతో రొమాంటిక్ మూమెంట్స్, సంతోషంతో పొంగిపోయిన కళ్యాణ్.. సంజనకి ఓజీ రేంజ్ ఎలివేషన్
ఆ స్టార్ హీరో వల్ల కెరీర్ నాశనం చేసుకున్న భూమిక, నగ్మా, స్నేహ ఉల్లాల్.. లిస్టులో మొత్తం ఏడుగురు బాధితులు