తెలుగులో డిజాస్టర్, కన్నడంలో రీమేక్

Published : Jun 22, 2019, 09:21 AM IST
తెలుగులో డిజాస్టర్, కన్నడంలో రీమేక్

సారాంశం

ఒక భాషలో హిట్టైన సినిమాని అక్కడ ఎందుకు ఏ కారణాల వల్ల హిట్టైందో చూసుకోకుండా మిగతా భాషల్లో రీమేక్ చేయాలనే ప్రయత్నాలు చేస్తూంటారు. 

ఒక భాషలో హిట్టైన సినిమాని అక్కడ ఎందుకు ఏ కారణాల వల్ల హిట్టైందో చూసుకోకుండా మిగతా భాషల్లో రీమేక్ చేయాలనే ప్రయత్నాలు చేస్తూంటారు. అలాగే  ఆ మధ్యన తెలుగులో సునీల్ హీరోగా ‘టూ కంట్రీస్‌’ సినిమా వచ్చి డిజాస్టర్ అయ్యింది. ఆ సినిమాని ఇప్పుడు కన్నడంలో రీమేక్ చేస్తున్నారు.  దిలీప్, మమతా మోహన్ దాస్ జంటగా నటించిన 'టూ కంట్రీస్' మళయాళంలో మంచి విజయాన్ని నమోదు చేసింది. 

కన్నడ రీమేక్ విషయానికి వస్తే..యోగానంద్‌ ముద్దాన్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ‘అధ్యక్ష ఇన్‌ అమెరికా' సినిమా హాస్య ప్రధానంగా రూపొందుతోంది. ఇందులో శరణ్‌, రాగిణి జంటగా కనిపించనున్నారు. తెలుగు నిర్మాత విశ్వప్రసాద్‌ నిర్మాణ సారథ్యంలో రూపొందుతున్న ఈ సినిమా షుూటింగ్ ను ఇప్పటి వరకు 40 రోజుల పాటు కొనసాగించారు. జులైలో విడుదల చేయాలనే సన్నాహాల్లో ఉన్నారు. 

2014లో విడుదలైన అధ్యక్ష సినిమా సీక్వెల్‌గా దీన్ని సిద్ధం చేస్తున్నట్లు యూనిట్‌ సభ్యులు తెలిపారు. షూటింగ్ లో 70 శాతం మేర అమెరికాలో కొనసాగించినట్లు తెలిపారు. సాధుకోకిలా, రంగాయణ రఘు, అవినాశ్‌, ప్రకాష్‌ బెళవాడి ప్రధాన తారాగణం.

PREV
click me!

Recommended Stories

Top 10 Heroines : రష్మిక కు సమంత గండం, సినిమాలు లేకున్నా మొదటి స్థానంలో ఎలా? టాప్ 10 హీరోయిన్ల లిస్ట్ ఇదే?
Malliswari Review: బావ మరదలుగా ఎన్టీఆర్, భానుమతి రొమాన్స్, ఫస్ట్ తెలుగు పాన్ వరల్డ్ మూవీగా మల్లీశ్వరి రికార్డు..