ది కాశ్మీర్ ఫైల్స్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన అక్షయ్ కుమార్, ఆ సినిమా వల్ల ఏం జరిగిందంటే..?

By Mahesh Jujjuri  |  First Published Mar 27, 2022, 1:37 PM IST

మన దేశంలో ఉన్న 100 కోట్ల హీరోలలో అక్షయ్ కుమార్ ఒకరు. గెలుపుఒటములతో పనిలేకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్లే అక్షయ్ కుమార్... రీసెంట్ గా మరో సినిమాపై చేసిన కామెంట్స్  హాట్ టాపిక్ అయ్యాయి. 
 


అక్షయ్ కుమార్ వరుసగా సినిమాలు చేసుకుంటూ పోతున్నారు. భారీ బడ్జెట్ తో..భారీ కాస్టింగ్ తో అక్షయ్ సినిమాలు ఉంటాయి. ఈకరోనా టైమ్ లో లక్ష్మీ లాంటి సినిమాలు ఆయన్ను నిరాశపరిచాయి..అయితే సరే గ్యాప్ దొరికితే సినిమాలు కంప్లీట్ చేస్తుంటాడు స్టార్ హీరో. రీసెంట్ గా బచ్చన్ పాండే సినిమాతో ఆడియన్స్ ను పలకరించాడు అక్షయ్. కాని ఈ సినిమా కలెక్షన్స్ పై నిరాశలో ఉన్నారు. 

అక్షయ్ కుమార్ బచన్ పాండేకు ఓ చిన్న సినిమా నుంచి పోటీ ఎదురయ్యింది. అస్సలు ఊహించని విధంగా చిన్న సినిమాగా రిలీజ్ అయ్యి ది కశ్మీర్ ఫైల్స్ దేశ వ్యాప్తంగా భారీ వ‌సూళ్లు రాబ‌డుతంది. ఇదే స‌మ‌యంలో విడుద‌లైన హీరో అక్ష‌య్ కుమార్ సినిమా బచ్చన్ పాండే కు విమ‌ర్శ‌కుల నుంచి ప్ర‌శంస‌లు వ‌చ్చిన‌ప్ప‌టికీ అంత‌గా వ‌సూళ్లు రాబ‌ట్టలేక‌పోతోంది. 

Latest Videos

ఈ విష‌యంపై అక్ష‌య్ కుమార్ స్పందిస్తూ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఓ ఈవెంట్ లో ఆయన మాట్లాడుతూ...ది కశ్మీర్ ఫైల్స్ మూవీ ఇండియాలో ఎంతోమంది ప్రేక్షకుల హృదయాలను కదిలించిందని చెప్పారు. ఆ సినిమా మంచి విజ‌యాన్ని సాధించింద‌ని అయితే, ఆ సినిమా ప్ర‌భావం త‌న బచ్చన్ పాండే పై పండింద‌ని అన్నారు.  త‌న సినిమా మొత్తం వ‌సూళ్ల‌ను దెబ్బకొట్టిందని తెలిపారు. 

అక్ష‌య్ కుమార్ వ్యాఖ్య‌ల‌పై ది కశ్మీర్ ఫైల్స్ సినిమా ద‌ర్శ‌కుడు వివేక్ అగ్నిహోత్రి స్పందించారు. అక్ష‌య్ కుమార్ చేసిన వ్యాఖ్య‌ల‌ను త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో పోస్ట్ చేస్తూ.. త‌న సినిమాను అభినందించినందుకు ధన్యవాదాలు అక్షయ్ కుమార్ అని పేర్కొన్నారు. చిన్న సినిమాగా రీలీజ్ అయిన ది కాశ్మీర్ ఫైల్స్ సినిమా  కాశ్మీరి పండిట్ల పై జరిగిన అరాచకాలను కళ్లకు కట్టినట్టు తెరకెక్కించారు.

 ఈసినిమాకు ప్రధాని మోదీ దగ్గర నుంచి బిజేజీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు ఇలా అంతా సపోర్ట్ చేయడం, పన్ను రాయితీలు ఇవ్వడంతో  200 కోట్లకు పైగా కలెక్షన్స్ ను సాధించింది. అంతే కాదు. ఈసినిమా చాలా వివాదాలకు కూడా కారణం అయ్యింద. మోచ్చుకున్న వాళ్లే కాదు ఈసినిమాపై విమర్షలు గుప్పించిన వారు కూడా లేకపోలేదు. 
 

click me!