Covid: హీరో యష్ కి సూపర్ హిట్ ఇచ్చిన దర్శకుడు మృతి.. బలితీసుకున్న కోవిడ్

Sreeharsha Gopagani   | Asianet News
Published : Jan 21, 2022, 07:59 AM IST
Covid: హీరో యష్ కి సూపర్ హిట్ ఇచ్చిన దర్శకుడు మృతి.. బలితీసుకున్న కోవిడ్

సారాంశం

చిత్ర పరిశ్రమలో విషాదకర సంఘటనలు ఆగడం లేదు. సినీ ప్రముఖులు వరుసగా అకాల మరణం చెందుతున్నారు. తాజాగా కన్నడ చిత్ర పరిశ్రమ ఓ ప్రముఖ దర్శకుడిని కోల్పోయింది.

చిత్ర పరిశ్రమలో విషాదకర సంఘటనలు ఆగడం లేదు. సినీ ప్రముఖులు వరుసగా అకాల మరణం చెందుతున్నారు. తాజాగా కన్నడ చిత్ర పరిశ్రమ ఓ ప్రముఖ దర్శకుడిని కోల్పోయింది. దర్శకుడు ప్రదీప్ రాజ్ (46) కోవిడ్ కారణంగా గురువారం తుదిశ్వాస విడిచారు. 

దీనితో ప్రదీప్ రాజ్ కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. కొన్నిరోజుల క్రితం ప్రదీప్ రాజ్ కు కోవిడ్ పాజిటివ్ అని తేలడంతో బెంగుళూరులోని ఓ ప్రయివేట్ ఆసుపత్రిలో కుటుంబ సభ్యులు చేర్పించారు. క్రమంగా ఆయన ఆరోగ్యం క్షీణిస్తూ వచ్చింది. ప్రదీప్ రాజ్ కు షుగర్ కూడా ఉండడంతో ఆరోగ్య పరిస్థితి మరింత దిగజారింది అని వైద్యులు పేర్కొన్నారు. దీనితో వైద్యానికి ఆయన శరీరం రియాక్ట్ కాలేదు. 

చికిత్స పొందుతూ గురువారం ప్రదీప్ రాజ్ కన్నుమూశారు. ఆయన స్వస్థలం పాండిచ్చేరిలో కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. కెజిఎఫ్ చిత్రంతో పాన్ ఇండియా స్టార్ గా మారిన యష్ కూడా ప్రదీప్ రాజ్ దర్శకత్వంలో నటించాడు. 2011లో వీరిద్దరి కాంబినేషన్ లో 'కిరాతక' చిత్రం విడుదలై సూపర్ హిట్ అందుకుంది. 

యష్ తో కిరాతక 2 కూడా తీయాలని అనుకుంటున్నట్లు ప్రదీప్ రాజ్ గతంలో పేర్కొన్నారు. ఆ కల నెరవేరకుండానే ఆయన మరణించారు. అలాగే ప్రదీప్ రాజ్ దర్శకత్వంలో అనేక సూపర్ హిట్ చిత్రాలు తెరకెక్కాయి. ఆయన మృతితో కన్నడ చిత్ర పరిశ్రమలో ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

Chiranjeevi, Mahesh Babu సినిమాలతో పోటీ పడి టాప్ 5లో నిలిచిన హీరో, టాలీవుడ్ రాజకీయాలపై ఓపెన్ కామెంట్స్
Thalapathy Vijay సినిమా స్టోరీ లీక్, జన నాయగన్ కథ ఇదేనా? షాక్ లో మూవీ టీమ్